నాగ్ ఎస్ అన్నా…వెంకీ నో చెప్పాడా?

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో నాగ్ మరియు వెంకీ ఒకరు…ఇప్పుడు అంటే చిన్న హీరోల హల్‌చల్ మొదలయింది కానీ, అప్పట్లో అయితే టాప్ నలుగురి హీరోల్లో వీళ్ళిద్దరూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరి అలాంటి ఈ ఇద్దరూ కలసి నటిస్తే ఎలా ఉంటుందో కదా…వ్యక్తిగతంగా వీళ్ళిద్దరూ కాస్త ఒకరికి ఒకరు నచ్చకపోయినా, సినిమా పరంగా మాత్రం వీళ్ళు కలసి పని చేస్తే బావుంటుంది అనేది అందరి ఆలోచన. అయితే అదే క్రమంలో వీళ్ళిద్దరూ కలసి నటిస్తే బావుంటుంది అని అనుకున్న క్రమంలో ఒక తమిళ సినిమా ఒకటి తెరపైకి వచ్చిందట. ఆ సినిమా అయితే వీళ్ళిద్దరికీ కరెక్ట్ గా సరిపోతుంది అనేది అందరి వాదన…కానీ అసలు ట్వీష్ట్ అక్కడే ఉంది, ఆ సినిమా చెయ్యడానికి వెంకీ ఒప్పుకోలేదట…అయితే అసలు ఆ సినిమా ఏంటి? అని వివరాల్లోకి వెళితే…మాధ‌వ‌న్‌ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో న‌టించిన త‌మిళ చిత్రం విక్ర‌మ్ వేద త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన నేపధ్యంలో ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వస్తవానికి ఈమూవీలో వెంక‌టేష్‌ రానాలు న‌టించ‌బోతున్నార‌ని గ‌తంలో వార్త‌లొచ్చాయి. అయితే ఈచిత్రంలో న‌టించేందుకు వెంక‌టేష్ ఆశక్తి చూపించక పోవడంతో ఈ మూవి రీమేక్ ప్రాధమిక చర్చలలోనే ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా న‌టించ‌గా విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించాడు. ఇక ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టెర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్ర నటించేందుకు నాగ్ ఆసక్తి చూపుతున్నప్పటికీ పోలీస్ పాత్రలో చేసేందుకు మాత్రం వెంకీ పెద్దగా ఆసక్తి చూపడంలేదట. మరి వెంకీ ప్లేస్ లో వేరే ఎవరినైనా పెట్టి నాగ్ ఈ ప్రయోగం చేస్తాడో లేక, వెంకీ సైడ్ అయిపోయాడు కనుక తాను కూడా లైట్ తీసుకుని సైడ్ అయిపోతాడో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus