Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

అనుష్క శెట్టి, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘ఘాటి’ సెప్టెంబర్ 5న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, సినిమా ఓపెనింగ్స్‌కు కీలకంగా మారిన ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.గతంలో బరువు సమస్యల కారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడని అనుష్క, ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తోంది.

Anushka

కనీసం ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు కూడా హాజరు కాకపోవడం ఆమె అభిమానులను నిరాశపరుస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి మాత్రమే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

అయితే, ఆమె ప్రమోషన్లు చేయకపోయినా గత చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈసారి కూడా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ‘ఘాటి’ టీమ్ ధీమాగా ఉంది. సినిమా కంటెంట్ అద్భుతంగా ఉన్నా, అనుష్క స్వయంగా ప్రమోషన్లకు వస్తే ఓపెనింగ్స్ మరో స్థాయిలో ఉండేవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, జిషు సేన్‌గుప్తా, రవీంద్ర విజయ్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్. మరి అనుష్క ప్రమోషన్స్ లేకుండా ‘ఘాటి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఒకవేళ ‘ఘాటి’ కూడా బ్లాక్‌బస్టర్ అయితే, అనుష్క స్టార్‌డమ్ నెక్స్ట్ లెవెల్‌కి చేరడం పక్కా. ఫ్యాన్స్‌కు పండగే కాదు, ఆమె ముందు క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడతాయి.

‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus