హెడ్డింగ్ చూసి.. వార్త క్లిక్ చేసి వచ్చినట్లున్నారు. కొన్ని యూట్యూబ్ వీడియోస్‌లాగా, కొన్ని వార్తల్లా మిమ్మల్ని నిరాశపరచం లెండి. ఆమె ఇంట్లో ఏం చేస్తుందో చూసే లోపు ఈ మధ్య రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు చూశారా. చాలా మార్పు కనిపిస్తోంది. లాక్‌డౌన్ తెచ్చిన మార్పో లేక సినిమాలు తగ్గిన మార్పో కానీ కొత్త కొత్త పోజులతో ఫొటోలు దిగుతోంది. ఒకసారి లంగా ఓణిలో పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపిస్తే, ఒక్కోసారి వీపును చూపిస్తూ కుర్రాకారును ఊరిస్తోంది. ఒకసారి మెరిసిపోయే డ్రెస్సుల్లో కనిపిస్తే, ఇంకోసారి సాధారణ దుస్తులతో వయ్యారాలు ఒలకబోస్తుంది. మీరు చూడలేదా… అయితే ఓ సారి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌కి ఓ విజిట్ వేయండి.
సినిమాల్లో, బయట షోస్.. ఓపెనింగ్స్‌లోనూ హీరోయిన్లు ఆర్భాటంగా కనిపించడం సహజం. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు. అలా అన్ని ఇంటిలో ఉన్నప్పుడు కూడా అలానే ఉంటారా అంటే లేదనే చెప్పాలి. అప్పడప్పుడు వాళ్ల పర్సనల్ లైఫ్ ఫొటోలు షేర్ చేస్తుంటారు. రాశీ ఖన్నా కూడా అంతే. ‘‘కెమెరా ముందు ఉన్నప్పుడు మాత్రమే నేను నటిని. సెట్ నుంచి బయటకు వచ్చాక అందరిలా మారిపోతాను. అదే ఇంటికెళ్లాక నా చుట్టూ వాతావరణం మారిపోతుంది. ఎలాంటి స్పెషల్స్ ఉండవు. అందరి ఇళ్ల తరహాలోనే చాలా సాధారణంగా ఉండేలా చూసుకుంటాను. నా అవసరాలు కూడా అలాగే ఉంటాయి. ఏదైనా పుస్తకం చదువుకుంటాను. లేదంటే నాతో నేను గడుపుతూ, నిశ్శబ్దంగా ఉంటాను’’ అని ఓ సందర్భంలో చెప్పింది రాశ.
అంత సాధారణంగా ఎలా ఉండగలుగుతానో తెలుసా అంటూ… ‘‘ఆధ్యాత్మిక ప్రభావమేమో, లేక పెరిగిన వాతావరణమో తెలియదు కానీ ప్రశాంతంగా ఉండటం అలవాటు అయిపోయింది. అందుకే సినిమా కెరీర్‌లో ఒడుదొడుకుల గురించి పెద్దగా పట్టించుకోను. ఎప్పుడూ ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. అలాగే బెస్ట్ థింగ్ కనిపిస్తే వదిలిపెట్టను. ఒకవేళ అలాంటిది దొరక్కపోతే… ఉత్తమమైనది ఇంకా ముందు రోజుల్లో దక్కుతుందనే నమ్మకంతో ఉంటాను. నా జీవితంలో ఈ విషయాల్ని ఎప్పటికీ వదిలిపెట్టను’’ అని చెప్పింది రాశీ ఖన్నా.
1
2
3
4
5
6
More..
1
2
3
4
5
6
7
More..
1
2
3
4
5
6
7
8
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!