మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు అని ప్రకటించగానే ముందుగా రానా పేరే ఎక్కువగా వినిపించింది. పృథ్వీరాజ్ పాత్రలో అతను కనిపించబోతున్నట్టు ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది.సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో.. ఒరిజినల్ లో బిజు మీనన్ పోషించిన పాత్రలో పవన్ కనిపించబోతున్నట్టు స్పష్టమయ్యింది. కానీ రానా పాత్ర విషయం పై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు.
దాంతో రానా ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నట్టు అంటూ వార్తలు మొదలయ్యాయి. రానా స్థానంలో నితిన్ లేదా సాయి తేజ్ వంటి వారు నటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. రానా ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉండచ్చు అని విశ్లేషకులు అంచనా. ఒకటి రానా ఇప్పుడు ‘విరాటపర్వం’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరోపక్క ‘అరణ్య’ ప్రమోషన్స్ కూడా చెయ్యాల్సి ఉంది. వీటితో పాటు తాజాగా తమిళ దర్శకుడు మిలింద్ రౌ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి కూడా ఓకే చెప్పాడు.
ఈ మూడు ప్రాజెక్టులతో రానా బిజీగా ఉన్నాడు కాబట్టే.. ‘అయ్యప్పనుమ్ కోషియం’ కు ఓకే చెప్పాడం లేదు అన్నది ఒక రీజన్ అయితే, మరోపక్క రానా అడిగినంత పారితోషికం నిర్మాతలు ఇవ్వడం లేదని.. అందుకే అతను ఇంకా ఓకే చెప్పడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏది నిజమో దర్శకనిర్మాతలే క్లారిటీ ఇవ్వాలి మరి.