Chiranjeevi: చిరంజీవి ఫ్యాన్స్‌ పండగకి సిద్ధంకండి మరి!

Advertisement

అభిమాన హీరో పుట్టిన రోజు నాడు… ఏమేం సర్‌ప్రైజ్‌లు వస్తాయో అంటూ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తుంటారు. అలా ఈ నెల 22 కోసం చిరంజీవి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలని ఫ్యాన్స్‌ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి సినిమాల అప్‌డేట్‌ల రూపంలో ఏమివ్వడానికి చిరంజీవి టీమ్‌ సిద్ధమైందో తెలియాలి. అయితే దీనిపై కొన్ని వార్తలు వస్తున్నాయి.

‘ఆచార్య’ సినిమాలో రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. పుట్టిన రోజులోపు అవి పూర్తయిపోతాయి. కాబట్టి సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించొచ్చు అంటున్నారు. దాంతోపాటు టీజర్‌ కూడా వస్తుందని టాక్‌. ఇది కాకుండా చిరంజీవి మరో మూడు సినిమాలు లైన్‌లో పెట్టుకున్నారు. ‘లూసిఫర్‌’ రీమేక్‌, ‘వేదాళం’ రీమేక్‌, బాబి సినిమా ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ వస్తుంది అంటున్నారు. అందులో ‘లూసిఫర్‌’ రీమేక్‌ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ పక్కా అంటున్నారు. అది ‘గాడ్‌ఫాదర్‌’ అనేది పక్కా రూమర్‌.

ఇది కాకుండా చిరంజీవి ఇటీవల కాలంలో కొంతమంది దర్శకుల కథలు విన్నారు. వారిలో కొన్ని సినిమాల గురించి ఆగస్టు 22న క్లారిటీ రావొచ్చు. వాళ్లు చెప్పకపోయినా… చిరంజీవికి బర్త్‌డే విషెష్‌ చెబుతూ నిర్మాతలు పోస్టర్లు విడుదల చేస్తారు. దాని బట్టి ఏయే సినిమాలు నెక్స్ట్‌ అనేది ఓ లెక్కకి వచ్చేయొచ్చు. చూద్దాం… ఏయే సినిమాలు, దర్శకులు లెక్క ఆ రోజు తేలుతుందో.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus