Jr NTR: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కెరీర్‌లో ఇది ఫస్ట్‌ టైమేమో!

  • April 9, 2021 / 11:09 AM IST

వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న దర్శక, హీరోలు వారిద్దరూ. అయితే ఏమైందేమో కానీ, ఆ ఇద్దరి గురించి సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి. ఆ వార్తలకు ప్రధాన కారణం ఇద్దరూ కలసి చేస్తామన్న సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తుండటమే. కొన్ని రోజుల క్రితం సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత ముహూర్తపు సన్నివేశం కూడా షూట్‌ చేసేశారు. తీరా చిత్రీకరణకు వచ్చేసరికి ఇదిగో రేపు, మాపు అంటూ వాయిదాలు పడుతూనే ఉంది. తీరా ఇప్పుడేమో లేదు అంటున్నారు. దీంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఆ మాటకొస్తే ఇప్పుడు ఆ దర్శకుడు, హీరో కూడా అయోమయంలోనే ఉన్నారని టాక్‌.

ఇప్పుడు చెప్పిందంతా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా లేదు అని పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్‌ కొత్త కథలు వింటున్నాడని, త్రివిక్రమ్‌ వేరే సినిమా పనిలో పడ్డాడనీ వార్తలొస్తున్నాయి. అయితే తర్వాతి సినిమా విషయంలో ఇద్దరికీ ఓ క్లారిటీ రాలేదట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ పని చేయాలి. ఇప్పుడది లేకపోవడంతో ‘జాతిరత్నం’ అనుదీప్‌ కథ విన్నాడని అంటున్నారు. అది కాకపోతే పనికొస్తుందని కొరటాల శివతో కూడా ఓ మాట వేశాడట. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. అంతకుముందు అనుకున్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌తో చేస్తాడా అనేదీ తెలియడం లేదు.

మరోవైపు త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ ఏంటి అనేది తెలియడం లేదు. ఎన్టీఆర్‌ సినిమా లేకపోతే ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. మహేష్‌బాబుతో సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నా… ఇంకా ఆ విషయం ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు మహేష్‌ ఇంకా ‘సర్కారు వారి పాట’ పూర్తి చేయలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇంత త్వరగా పూర్తయ్యేలా కూడా కనిపించడం లేదు. దీంతో యంగ్‌ హీరో తో సినిమా తీసే ఉద్దేశంలో కూడా త్రివిక్రమ్‌ ఉన్నాడని టాక్‌. అలా త్రివిక్రమ్‌ కూడా ఇంకా ఫైనల్‌ అవ్వలేదన్నమాట.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus