అప్పట్లో విఠలాచార్య గారు తెరకెక్కించిన సినిమాలో గ్రాఫిక్స్ చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు. ఎలాంటి గ్రాఫిక్స్ అందుబాటులో లేనప్పుడు ఆయన చేసిన మేజిక్కులు మాములువి కావు. కానీ.. ఇప్పుడు గ్రాఫిక్స్ అందుబాటులోకి వచ్చేసరికి అందరూ వాటిని కాస్త ఎక్కువగానే వాడుతున్నారు. అయితే.. ఈ వాడకం ఈమధ్యకాలంలో కాస్త శ్రుతి మించింది. అనవసరమైన గ్రాఫిక్స్ తో నిర్మాతలకు ఖర్చు పెరుగుతుంది తప్పితే.. సినిమాకి ఆ గ్రాఫిక్స్ ఏ రకంగానూ ప్లస్ అవ్వడం లేదు. అందుకు తాజా ఉదాహరణ “సాహో, సైరా” చిత్రాల్లోని బ్లాక్ పాంతర్ లు.
ఈ రెండు సినిమాల్లోనూ బ్లాక్ పాంతర్ ను అనవసరంగా వాడారు. ఆ లైవ్ మోషన్ ను క్యాప్చర్ చేయడానికి ఖర్చు గట్టిగానే అవుతుంది. కానీ.. సినిమాలో ఆ బ్లాక్ పాంతర్ వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆ స్థానంలో ఒక మామూలు కుక్కని పెట్టినా పెద్ద తేడా ఉండదు. అలాంటిది నిర్మాతలు ఎందుకని ఇలాంటి అనవసరమైన ఖర్చులకు డబ్బును వృధా చేస్తున్నారు అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం. మరి ఇప్పటికైనా మన దర్శకనిర్మాతలు ఇలాంటి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొంటే మంచిది.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!