హీరోయిన్స్ కనిపించగానే మదిలో మెదిలే పేరు

సినిమా హీరోయిన్స్ కి సాధారణమైన పేర్లతో పాటు ముద్దు పేర్లు కూడా ఉంటాయి. ఆ పేర్లతో కుటుంబ సభ్యులు, దగ్గరైన వారు మాత్రమే పిలుస్తారు. ఇక అభిమానులు పిలుచుకునే పేర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఆమెను చూడగానే .. అందరి మదిలో ఒక కామన్ పేరు గుర్తుకొస్తుంది. అది ఆమె ట్యాలెంట్ కి సంబంధించింది కావచ్చు.. అందం కావచ్చు.. ఏదైనా.. ఒకరు కనిపించగానే పిలవాలనిపించే పేర్లపై ఫోకస్..

తమన్నా(సూపర్ డ్యాన్సర్ )మిల్కీ బ్యూటీ తమన్నా సౌందర్యరాశి. అందంలో వంక పెట్టలేము. కానీ ఆమె పేరు చెప్పగానే సూపర్ డ్యాన్సర్ అనే మాట మన నోటి వెంట వచ్చేస్తుంది. అంతలా తమన్నా తన స్టెప్పులతో అదరగొట్టింది.

శృతి హాసన్ (మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ )శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే డ్యాన్సర్, సింగర్ గా నిరూపించుకుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని ట్యాలెంట్ దాగుంది కాబట్టే అందరూ ఆమెని మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ అని పిలుస్తారు.

సాయి పల్లవి (నేచురల్ బ్యూటీ ) హీరోయిన్స్ అంటే ఎంతో కొంత మేకప్ వేసుకోవాలి. కమర్షియల్ మూవీకి తప్పనిసరి. కానీ మలయాళ బ్యూటీ సాయి పల్లవి సింపుల్ గా నటించి అందరినీ ఫిదా చేసింది. అందుకే ఆమెకు నేచురల్ బ్యూటీ అని ట్యాగ్ తగిలించారు.

అనుష్క (చక్కని నటి) నేటి కాలంలో హీరోయిన్స్ అంటే స్కిన్ షో, రొమాంటిక్ సీన్స్, డ్యాన్సులకే పరిమితమవుతున్నారు. సినీ మేకర్స్ కూడా అంతే కోరుకుంటున్నారు. అయితే అనుష్క విషయంలో మాత్రం ఈ రూల్ చెల్లదు. అన్ని రకాలుగా శక్తివంతమైన మహిళా పాత్రల్లో అనుష్క నటించి మెప్పించారు. అందుకే అనుష్క అంటే అన్ని పాత్రలు చక్కగా పోషించే నటిగా మనసులో ముద్రుంచుకున్నారు.

సమంత ( క్యూట్ బ్యూటీ) అమాయకమైన కళ్లు, చిలిపి తగాదాలు, ముద్దొచ్చే మాటలు.. సమంత ఎంచుకున్న పాత్రలు చేసే పనులు ఇవి. అందుకే ఆమె తెలుగు ప్రజల గుండెల్లో క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు.

కాజల్ అగర్వాల్ (ఫ్యాన్ ఫాలోయింగ్) హీరోయిన్స్ కి ఎక్కువగా అబ్బాయిల్లో ఫ్యాన్స్ ఉంటారు. కానీ అమ్మాయిల్లోనూ ఎక్కువమందిని అభిమానులను సొంతంచేసుకున్న నటి కాజల్ అగర్వాల్. అందుకే కాజల్ పేరు చెప్పగానే ఫ్యాన్ ఫాలోయింగ్ అనే మాట గుర్తుకు వస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ (ఫిట్ బ్యూటీ)నేటి హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టైలే వేరు. హీరోతో పోటీగా ఫిట్ గా అంటూ అభిమానులను సొంతం చేసుకుంటోంది. అందుకే ఆమెకు ఫ్యాన్స్ ఫిట్ బ్యూటీ అని పేరు పెట్టేసారు.

నిత్యా మీనన్ (సహజ నటి) ఇప్పటి ప్రేక్షకులకు సౌందర్య లేని లోటుని నిత్యా మీనన్ తీర్చుతోంది. సహజమైన నటనతో ఆకట్టుకుంటోంది. సహజ నటిగా ప్రసంశలు అందుకుంటోంది.

అనుపమ పరమేశ్వరన్ (అందమైన నవ్వు)అనుపమ స్కిన్ షో చేయదు. కన్నీరు పెట్టించే పాత్రలు చేయలేదు. కానీ ఆమె అంటే యువతకి ఇష్టం. ఆమె నవ్వంటే చాలా ఇష్టం. అందమైన నవ్వు అనుపమ అని ఫ్యాన్స్ ఫిక్స్ చేసేసారు.

లావణ్య త్రిపాఠి (సొట్ట బుగ్గలు) అప్పట్లో ప్రీతీ జింతా సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి సొట్ట బుగ్గలతో ఆకర్షిస్తోంది. అందుకే ఆమె పేరు కంటే సొట్టబుగ్గలే ఎక్కువమందికి గుర్తుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus