యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఈ ఏడాది తీరుతుందని భావించారు. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ చెయ్యాల్సి ఉంది. ఎన్టీఆర్ కూడా బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. ఇద్దరి చిత్రాలు కంప్లీట్ అయిన తర్వాత వీరి కాంబోలో మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని ఆశించారు. కానీ ఈ కథలో ట్విస్ట్ వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ మల్టీ స్టారర్ మూవీ నిర్మిస్తున్నట్లు నిన్న ప్రకటించారు.
దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో యంగ్ టైగర్ 28 వ ఫిల్మ్ డైరక్టర్ విషయంలో డైలమా ఏర్పడింది. తారక్ సినిమాని పూర్తి చేసిన తర్వాత మెగా మూవీ చేస్తారా? లేకుంటే మెగా మూవీ కోసం ఎన్టీఆర్ చిత్రాన్ని పక్కన పెడుతారా? అనే విషయంపై త్రివిక్రమ్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏ సినిమాని పోస్ట్ పోన్ చేసినా ఆ ఆ హీరో ఫ్యాన్స్ నుంచి మాటల మాంత్రికుడు వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.