తెలుగులో ‘పింక్’ రీమేక్ ఉన్నట్టా.. లేనట్టా… ?

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పింక్’ చిత్రాన్ని సౌత్ లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి తమిళ్ లో ఈ చిత్రాన్ని ‘నెర్కొండ పార్వై’ గా రూపొందించారు. అజిత్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ లో లానే తమిళ్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యి రైట్స్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తోనే ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఈ చిత్రం పై పవన్ కళ్యాణ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ‘జనసేన’ పార్టీని బలోపేతం చేసే పనిలోనే ఆయన బిజీగా గడుపుతున్నారు. అయితే మరో పక్క దిల్ రాజు ఈ రీమేక్ ను జనవరి లో సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ బలంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాల్ని మొదటి షెడ్యూల్ లో కంప్లీట్ చెయ్యాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ‘ఓ మై ఫ్రెండ్’ ‘ఎం.సి. ఏ’ వంటి చిత్రాలని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అసలు ఈ రీమేక్ పై పవన్ ఎప్పటికి క్లారిటీ ఇస్తాడు అనేది చూడాల్సి ఉంది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus