Peddi: ఆగని ట్రోలింగ్.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!
- June 20, 2026 / 07:23 PM ISTByFilmy Focus Desk
‘పెద్ది’ సినిమా రిలీజ్ అయిన ముందు.. రిలీజ్ అయిన తర్వాత చర్చలో వచ్చిన మార్పు ఏంటి అంటే.. సినిమా వచ్చే ముందు కథ, రామ్‌చరణ్ పాత్ర చిత్రణ గురించి గొప్ప చెప్పుకుంటూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే రామ్‌చరణ్ లుక్స్, నటన, పాత్ర కోసం పడ్డ కష్టం గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. వాటితోపాటు అచ్చియమ్మ అలియాస్ జాన్వీ కపూర్ పాత్ర గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. దాంతో పాటు ఐటెమ్ సాంగ్ గురించి కూడా చర్చ నడుస్తోంది.
Peddi
టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఐటెమ్ సాంగ్ అనేది రానట్లు.. వచ్చినా వాటిలో అంతా మన సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే పదాలను వాడినట్లు.. ఇప్పుడు ‘హల్లల్లో హల్లో..’ పాట మీద తెలుగు సినిమా అభిమానులు విరుచుకుపడుతున్నారు. దీనిపై ఆ పాట రచయిత అనంత శ్రీరామ్ క్లారిటీలు ఇస్తున్నా ఇంకా విమర్శలు ఆగడం లేదు. దీంతో ఆయన ‘ఐటెమ్ గాళ్లు’ లాంటి హార్ష్ వర్డ్స్ వాడి మరీ రియాక్ట్ అయ్యారు. దాని మీదా విమర్శలు రావడంతో ఇప్పుడు మరో రియాక్షన్ ఇచ్చాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విమర్శల జడివాన గురించి మరోసారి రియాక్ట్ అయ్యారు. ‘‘జియో వచ్చిన తరవాత డేటా ఫ్రీ అయిపోయింది. వాక్ స్వాతంత్య్రం కాస్తా వాగే స్వాతంత్య్రంగా మారిపోయింది. అందుకే.. సోషల్ మీడియాలో ఈ విమర్శల దాడి” అని తనదైన శైలిలో విమర్శలు చేశారు. నిజానికి ఆయనకు పాట విషయంలో విమర్శలు కొత్త కాదు. గతంలో ‘వరుడు కావలెను’ సినిమాలో ‘దిగు దిగు నాథ..’ పాటకు కూడా ఇలానే విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆయన కాస్త ఎక్కువ ఆగ్రహంతో మాట్లాడుతున్నారు కానీ.. ఇలాంటి పాటలు, ఇలాంటి సాహిత్య వినియోగం తెలుగు సినిమాలో కొత్తేమీ కాదు. ఎంతో మంది సుప్రసిద్ధ గీత రచయితలు, అవార్డులు అందుకున్న రచయితలు సైతం రాశారు. అప్పుడు సాహిత్య అభిలాషులకు రాని ఆగ్రహం ఇప్పుడు వస్తోంది. ఇదే ఆయన్ని ఇలా రియాక్ట్ అయ్యేలా చేస్తోంది అనిపిస్తోంది. దీంతో ఇప్పటికైనా ఆ ఐటెమ్ చర్చ ఆగితే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
















