Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rajamouli: రాజమౌళితో సినిమా చేశాక ఆ నిర్మాతలు ఏమవుతున్నారు?

Rajamouli: రాజమౌళితో సినిమా చేశాక ఆ నిర్మాతలు ఏమవుతున్నారు?

  • October 27, 2022 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: రాజమౌళితో సినిమా చేశాక ఆ నిర్మాతలు ఏమవుతున్నారు?

రాజమౌళితో సినిమా అంటే మామలూగా ఉండదు. సినిమా ఎంత భారీగా ఉంటుందో, దానికి అయ్యే ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. వీటితోపాటు సినిమా విడుదల అయ్యాక వచ్చే వసూళ్లు కూడా అలానే ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. గత కొన్ని సినిమాల నుండి ఈ విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత మూడు సినిమాల నుండి ఇంకా చెప్పాలంటే రెండు సినిమాల నుండి వేరొక విషయం కూడా చర్చలోకి వస్తోంది. అదే నిర్మాతలు.. అదేనండీ నిర్మాతలు ఎక్కడ?

రాజమౌళి సినిమాల లిస్ట్‌లో లాస్ట్‌ నుండి చూసుకుంటూ వెళ్తే నిర్మాతలు వీళ్లే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. అంతకుముందు వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ రెండు సినిమాలకు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని. ఈ ముగ్గురు గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా తెలుసు. అప్పటికే కొన్ని సినిమాలు చేసే ఉన్నారు. అయితే ఇక్కడ విషయం అది కాదు. ఆయా సినిమాల తర్వాత ఈ నిర్మాతలు ఏమయ్యారు అని. అటు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని కానీ.. ఇటు డీవీవీ దానయ్య కానీ ఎక్కడా కనిపించడం లేదు.

అదేంటి.. కనిపించకపోవడం అంటారా. కనిపించడం లేదు అంటే.. సినిమాలు చేయడం లేదని. ‘బాహుబలి’ తర్వాత ఆర్కా మీడియా నుండి మరో భారీ సినిమా రాలేదు. ‘పెళ్లిసందD’ అని ఒక సినిమా చేశారు అంతే. అంతకుముందు ఓ టీవీ సీరియల్‌ నిర్మించారు. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా, భారీ లాభాలొచ్చిన సినిమా చేశాక మళ్లీ ఇంకో భారీ సినిమా స్టార్ట్‌ చేయకపోవడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఇలాంటి సినిమానే పొందిన దానయ్య కూడా మరో సినిమా చేయడం లేదు.

కొడుకుతో ‘అధీర’ అనే సినిమా ముహూర్తం జరుపుకున్నా.. ఆ తర్వాత దాని ఊసే లేదు. ప్రభాస్‌తో ఓ సినిమా ఉంటుంది అని వార్తలొచ్చాయి కానీ.. ఆ తర్వాత నిర్మాత మారిపోయారు. ఇటు చిరంజీవి – వెంకీ కుడుముల సినిమాకు దానయ్యే నిర్మాత. కానీ ఇప్పుడు ఆ సినిమా నుండి కూడా దానయ్య తప్పుకున్నారు అంటున్నారు. దీంతో రాజమౌళి సినిమా తర్వాత ఆ నిర్మాతలు ఎక్కడ అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక మహేష్‌బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాకు నిర్మాత కె.ఎల్‌.నారాయణ. ఆయన చాలా రోజుల నుండి ఇండస్ట్రీలో లేరు. సుమారు 15 ఏళ్లుగా ఆయన సినిమాలు చేయడం లేదు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

3 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

4 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

5 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

5 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

4 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

5 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

5 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

6 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version