Rajamouli: రాజమౌళితో సినిమా చేశాక ఆ నిర్మాతలు ఏమవుతున్నారు?

రాజమౌళితో సినిమా అంటే మామలూగా ఉండదు. సినిమా ఎంత భారీగా ఉంటుందో, దానికి అయ్యే ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. వీటితోపాటు సినిమా విడుదల అయ్యాక వచ్చే వసూళ్లు కూడా అలానే ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. గత కొన్ని సినిమాల నుండి ఈ విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత మూడు సినిమాల నుండి ఇంకా చెప్పాలంటే రెండు సినిమాల నుండి వేరొక విషయం కూడా చర్చలోకి వస్తోంది. అదే నిర్మాతలు.. అదేనండీ నిర్మాతలు ఎక్కడ?

రాజమౌళి సినిమాల లిస్ట్‌లో లాస్ట్‌ నుండి చూసుకుంటూ వెళ్తే నిర్మాతలు వీళ్లే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. అంతకుముందు వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ రెండు సినిమాలకు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని. ఈ ముగ్గురు గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా తెలుసు. అప్పటికే కొన్ని సినిమాలు చేసే ఉన్నారు. అయితే ఇక్కడ విషయం అది కాదు. ఆయా సినిమాల తర్వాత ఈ నిర్మాతలు ఏమయ్యారు అని. అటు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని కానీ.. ఇటు డీవీవీ దానయ్య కానీ ఎక్కడా కనిపించడం లేదు.

అదేంటి.. కనిపించకపోవడం అంటారా. కనిపించడం లేదు అంటే.. సినిమాలు చేయడం లేదని. ‘బాహుబలి’ తర్వాత ఆర్కా మీడియా నుండి మరో భారీ సినిమా రాలేదు. ‘పెళ్లిసందD’ అని ఒక సినిమా చేశారు అంతే. అంతకుముందు ఓ టీవీ సీరియల్‌ నిర్మించారు. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా, భారీ లాభాలొచ్చిన సినిమా చేశాక మళ్లీ ఇంకో భారీ సినిమా స్టార్ట్‌ చేయకపోవడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఇలాంటి సినిమానే పొందిన దానయ్య కూడా మరో సినిమా చేయడం లేదు.

కొడుకుతో ‘అధీర’ అనే సినిమా ముహూర్తం జరుపుకున్నా.. ఆ తర్వాత దాని ఊసే లేదు. ప్రభాస్‌తో ఓ సినిమా ఉంటుంది అని వార్తలొచ్చాయి కానీ.. ఆ తర్వాత నిర్మాత మారిపోయారు. ఇటు చిరంజీవి – వెంకీ కుడుముల సినిమాకు దానయ్యే నిర్మాత. కానీ ఇప్పుడు ఆ సినిమా నుండి కూడా దానయ్య తప్పుకున్నారు అంటున్నారు. దీంతో రాజమౌళి సినిమా తర్వాత ఆ నిర్మాతలు ఎక్కడ అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక మహేష్‌బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాకు నిర్మాత కె.ఎల్‌.నారాయణ. ఆయన చాలా రోజుల నుండి ఇండస్ట్రీలో లేరు. సుమారు 15 ఏళ్లుగా ఆయన సినిమాలు చేయడం లేదు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus