Srikanth Addala: SVSC రీ రిలీజ్ హవా.. అడ్డాల సౌండ్ లేదేంటీ?

స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయితే, ఆ సినిమాకు సంబంధించి మేకర్స్, నటీనటులు మీడియా ముందుకు వచ్చి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంటారు. కానీ ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) రీ రిలీజ్ సందడిలో మాత్రం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా మిస్సయ్యాడు. మహేష్ బాబు  (Mahesh Babu) , వెంకటేష్  (Venkatesh)  కలసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న తిరిగి థియేటర్లలోకి వచ్చి, అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్లలో ఫ్యాన్స్ చేసిన హంగామా చూస్తే ఇది మాస్ సినిమా రేంజ్‌లో ఉందనే అనిపించేలా వుంది.

Srikanth Addala

ఒకప్పుడు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala), SVSC తర్వాత చాలా ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్నారు. బ్రహ్మోత్సవం (Brahmotsavam) డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చిన ఆయన, చివరగా పెదకాపు 1 (Peddha Kapu 1) సినిమాతో బరిలోకి దిగారు. కానీ ఆ సినిమా ఫలితం అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు పెడకాపు 2 పై ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు SVSC రీ రిలీజ్ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వస్తారనుకుంటే, ఎక్కడా కనపడకపోవడం అందరిలోనూ ఆశ్చర్యం కలిగించింది.

సాధారణంగా క్లాసిక్ సినిమాల రీ రిలీజ్ టైమ్‌లో డైరెక్టర్లు ఇంటర్వ్యూలు ఇస్తూ, ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. గతంలో మురారి (Murari) రీ రిలీజ్ సమయంలో క్రిష్ణవంశీ (Krishna Vamsi) సోషల్ మీడియాలో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. కానీ SVSC విషయంలో మాత్రం దర్శకుడు ఎక్కడా కనపడకపోవడం ఆశ్చర్యంగా మారింది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రెస్‌మీట్ పెట్టినప్పటికీ, అడ్డాల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం తలెత్తించే ప్రశ్న.

అసలు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతారా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉంది. SVSC లాంటి బిగ్ హిట్ సినిమా తన ఖాతాలో ఉన్నా, ఇప్పుడలా అందరి దృష్టికి రాకుండా ఉండటమే ఆశ్చర్యకరంగా మారింది. మరి ఈ మౌనం వెనుక అసలు రీజన్ ఏమిటో త్వరలో తెలియనుందేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus