ఎ బి టి క్రియేషన్స్ వారి ‘వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ ‘ చిత్ర ప్రారంభోత్సవం

ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పణలో ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్ కె. రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ” వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ”. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఓ ప్రముఖ నటి తో పాటు పూజిత పొన్నాడా, మహత్, నవీన్ నేనీ, పంకజ్ ప్రధాన పాత్రధారులుగా పోషిస్తున్న ఈ నూతన చిత్రం ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో క్లాప్ నటుడు సుమన్ ఇవ్వగా, గురునాథ్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంబోత్సవాన్ని జరుపుకున్నారు..

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ… సస్పెన్సు థ్రిల్లర్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు కిషోర్ కుమార్ పరిచయం అవుతున్నారు.. అందరూ తెలుగు వారే నటిస్తున్నారు… వారినే ప్రోత్సహించాలని కూడా అనుకుంటున్నాము… జూన్ లో రెగ్యులర్ షూట్ ను ప్రారంభించి అక్టోబర్ దసరా నాటికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం.. మరిన్ని మంచి సినిమాలు ఈ బ్యానర్ నుంచి వస్తాయని ఆశిస్తూ.. టోటల్ టీమ్ కు నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అన్నారు… చాలా గ్యాప్ తరువాత తమిళ్ మూవీస్ నుంచి తెలుగు సినిమా చేయనున్నాను.. కమ్ బ్యాక్ అయినందు హ్యాపీగా ఉందని హీరో మహత్ తెలిపారు..

అతిథి సుమన్ మాట్లాడుతూ… గురునాథ్ గారు మా నైబర్.. అంతకంటే మంచి స్నేహితుడు. అందుకే ఈ చిత్ర ఓపనింగ్ కు వచ్చాను… సినిమా బాగా రావాలని, విజయం సాధించాలని కోరుకుంటూ విషెస్ తెలుపుతున్నా అన్నారు. స్టోరీ బాగా నచ్చింది. గౌరి అనే విల్లేజ్ గర్ల్ పాత్రలో నటిస్తున్నా… కామెడీ తో పాటు అన్నీ వేరీయేషన్స్ ఉన్న చిత్రమిది అన్నారు హీరోయిన్ పూజిత. దర్శకుడు కిశోర్ కుమార్ మాట్లాడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు నా కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది..

మంచి సబ్జెక్ట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.. ఈ చిత్ర రైటర్ తాటవర్తి కిరణ్ మాట్లాడుతూ… విల్లేజ్ బ్యాక్ డ్రాప్ లో 5 గురి జీవిత కథే ఈచిత్రం.. నలుగురు ఉన్నారు… ఇక ఐదో వ్యక్తి అంటే టైటిల్ రోల్ లో ప్రముఖ నటి పేరు సర్ప్రైజ్ లో ఉంచాము… తానే ఈ సినిమాకు లీడ్ అవుతుంది.. పెద్ద వంశీ గారి సినిమా తరహాలో ఆహ్లాదంగా ఉంటుంది ఈ చిత్రం అని అన్నారు… నటుడు నవీన్ మాట్లాడుతూ మంచి పాత్రతో మీ ముందుకు వస్తున్నా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus