Balakrishna, Ravi Teja: భగవంత్ కేసరి వర్సెస్ టైగర్ నాగేశ్వరరావు.. విన్నర్ ఆ హీరోనేనా?

Advertisement

దసరా పండుగ కానుకగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. రెండు ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండటంతో పాటు సినిమాలపై అంచనాలను పెంచేశాయి. బాలయ్య, రవితేజ మళ్లీ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. న్యూట్రల్ ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు.

ట్రైలర్లను చూసిన ప్రేక్షకులు ఈ రెండు సినిమాలు హిట్ కావడం గ్యారంటీ అని వేర్వేరు జానర్లలో తెరకెక్కిన సినిమాలు కావడంతో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో అంచనా వేయడం కూడా సాధ్యం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ట్రైలర్లలో మైనస్ లు ఉన్నా ఆ మైనస్ లు చాలా చిన్నవి అని చెప్పవచ్చు.

బడ్జెట్ విషయంలో భగవంత్ కేసరి పైచేయి సాధించగా ఒక్కరోజు గ్యాప్ లో ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. థియేటర్ల విషయంలో బాలయ్య సినిమా డామినేషన్ కనిపిస్తుండగా టాక్ ఆధారంగా థియేటర్ల విషయంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. గురువారం రోజున రిలీజ్ కానుండటంతో లాంగ్ వీకెండ్ కూడా ఈ సినిమాకు ప్లస్ కానుంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు టాలెంటెడ్ డైరెక్టర్లు పని చేశారు.

భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే మూవీ ఏదవుతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించి దసరా పండుగ ప్రేక్షకులకు మరింత సంతోషాన్ని కలిగించేలా చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయో చూడాల్సి ఉంది. (Balakrishna, Ravi Teja) బాలయ్య, రవితేజ కెరీర్ కు ఈ సినిమాల సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus