ఒక సినిమా విడుదల వాయిదా పడింది అంటే.. చాలా సినిమాల మీద ప్రభావం ఉంటుంది. అదే వాయిదా పడిన సినిమా స్టార్ హీరోది అయితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. గతంలో ఈ పరిస్థితి మనం చూశాం కూడా. ఇప్పుడు ఇదే సిట్యువేషన్ టాలీవుడ్‌లో కనిపిస్తోంది. దానికి కారణం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొంది, భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమై, ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిన సినిమా ‘అఖండ 2’. ఆ ఇబ్బందులు నిర్మాతలు పడుతుంటే.. మరోవైపు సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఇతర సినిమాల నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
‘అఖండ 2’ సినిమాను డిసెంబరు మొదటి వారంలో అనుకున్నదే ఇంచుమించు నెల రోజుల రన్ దొరుకుతుంది అని. అంటే ‘పుష్ప: ది రూల్’ సినిమాకు దొరికినట్లు. దానికితోడు విదేశాల్లో ‘అవతార్ 3’ సినిమా ఎఫెక్ట్ కూడా పడకూడదు అని. కానీ ఇప్పుడు సినిమా డిసెంబరు మొదటి వారంలో రాలేదు. డిసెంబరు 12న సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అదే జరిగితే ఇప్పుడు ఆ తేదీకి రెడీగా ఉన్న సినిమాలకు ఇబ్బంది. ఆ డేట్‌కి రోషన్ కనకాల ‘మోగ్లీ’, నందు ‘సైక్ సిద్దార్థ’, కార్త ‘అన్నగారు వస్తారు’ ఉన్నాయి.
ఇక డిసెంబరు 19 అనుకుంటే.. అమెరికాలో ‘అవతార్ 3’ సినిమాతో పోటీ పడాల్సి వస్తుంది. ఇక 25 తేదీన రోషన్ ‘ఛాంపియన్’, ఆది సాయి కుమార్ ‘శంబాల’ ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో ఏ డేట్ పట్టుకున్నా ఆ తేదీకి స్టికాన్ అయినవాళ్లు వాయిదా వేయాల్సిందే. పోనీ సంక్రాంతికి వెళ్తారు అనుకుంటే.. ఓటీటీ డీల్ అడ్డొస్తోందట. సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసుకుంది. అంటే కనీసం నెల ముందు థియేటర్లలో సినిమా పడాలి. లేదంటే ఓటీటీ వాటాలో నష్టం తప్పదు.
ఇక సంక్రాంతి సీజన్ ఇప్పటికే ఫుల్ టైట్ ఉంది. ప్రభాస్ ‘ఇ రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, విజయ్ ‘జననాయకుడు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలు ఉన్నాయి. కాబట్టి బాలయ్య ఇప్పుడు ఏ డేట్‌కి వచ్చినా వేరే సినిమాలకు వాయిదా కష్టం పక్కా.