Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?
- October 25, 2026 / 10:16 AM ISTByFilmy Focus Desk
పార్టీలు చేసుకోవద్దని ఎవరూ చెప్పారు.. సరదా పడొద్దనీ ఎవరూ చెప్పారు. ఎందుకంటే ఎవరి పార్టీలు వారిష్టం. కానీ మనకొక సెలబ్రిటీ హోదా వచ్చాక.. అందులోనూ పెద్ద స్టార్లతో సినిమాలు తీస్తున్నాక.. ‘ఏం చేస్తున్నాం’ అనేది కచ్చితంగా అందరూ చెక్ చేసే అంశమే. సెలబ్రిటీల చేతలు.. అయితే మంచి చెప్పాలి, లేదంటే ఏమీ చెప్పకుండా ఉండాలి. కానీ ఒక ప్రముఖ దర్శకుడి పనులు చూస్తుంటే అలా అనిపించడం లేదు. తన సరదాలను సోషల్ మీడియాలో నెటిజన్ల ముందు పెడుతున్నారు.
Sandeep Vanga
పుట్టిన రోజుకు పార్టీ అడగడం, ఇవ్వడం తప్పేమీ కాదు. కానీ అలా ఇచ్చిన పార్టీ ఏంటి, ఆ పార్టీ గురించి జనాలకు చెప్పడం ఏంటి? అనేది ఇక్కడ పాయింట్. ఆ అగ్ర దర్శకుడు ఇటీవల ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా ఫలితం వచ్చాక ఆనందంగా పార్టీ చేసుకున్నారు. అందులో మద్యపానం కూడా ఉంది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాని కింద కామెంట్లు చూసి కొన్ని చర్చలు కూడా జరిగాయి.
అగ్ర దర్శకుడిగా ఉండి.. ఇలాంటి వీడియోలు పెట్టడం ఎందుకు అనే చర్చ ప్రారంభించారు. అయితే ఆ వీడియోను ఆయన తనకు పాజిటివ్‌గా చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్న హీరో పుట్టిన రోజు సందర్భంగా పార్టీ అంటూ ఓ మందు సీసాతో ఓ ఫొటో పెట్టారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా హీరోతో మా డైరక్టర్ సిట్టింగ్ అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్.
అయితే, మందు బాటిల్‌తో సరదాగా కామెంట్లు చేసుకోవడం ఓకే.. ఇలా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి ‘మద్యం’ పోస్టులు ఎందుకు అనే చర్చ నడుస్తోంది. మామూలుగానే ఆయనకు ‘వైలంట్’ దర్శకుడు అని పేరు. ఆయన సినిమాలు అలానే ఉంటాయి మరి. చేసిన సినిమాల నేపథ్యాలు, హీరోల పాత్రల చిత్రణలు అలానే ఉంటాయి మరి.












