మళ్ళీ బన్నీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..!

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం డిజాస్టర్ కావడంతో చాలా గ్యాప్ తీసుకుని ఎలాగైనా హిట్టు కొట్టాలని త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా నివేదా పేతురేజ్ కూడా నటిస్తుంది. అయితే రెండో హీరోయినయినప్పటికీ బన్నీ హీరోయిన్ నివేదా పేతురేజ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

విషయం ఏమిటంటే.. బన్నీ తన తరువాతి చిత్రాన్ని ‘ఎం.సి.ఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఐకాన్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నివేదా పేతురేజ్ పేరుని రికమెండ్ చేస్తున్నాడట బన్నీ. ‘మెంటల్ మదిలో’ ‘చిత్రలహరి’ ‘బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది నివేదా. అందుకే బన్నీ దృష్టిలో పడినట్టుంది. ఇక నిర్మాత, డైరెక్టర్ కూడ బన్నీ రెకమెండేషన్ ను ఓకే చేస్తే నివేదా పేతురాజ్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus