నటుడిగా 44 ఏళ్ల అనుభవం, 150కిపైగా సినిమాలు చేసిన సీనియారిటీ.. ఇన్నేళ్ల కెరీర్‌లో చిరంజీవి చూడని ఫ్లాప్‌లా, హిట్‌లా, డిజాస్టర్‌లా, బ్లాక్‌బస్టర్‌లా చెప్పండి. మాస్ స్టార్ హీరోల లైఫ్‌లో ఎవరూ చూడని ఎత్తుపల్లాలు ఆయన చూశారు. ఎవరికీ లేని అనుభవం ఆయనకు ఉంది. అలాంటి ఆయనకు ఒక ఫ్లాప్ ఓకే.. ఓకే డిజాస్టర్ వస్తే.. కెరీర్ ఇక అయిపోయినట్లేనా.. రిటైర్ అయిపొమ్మని అడగడమేనా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న వినిపిస్తోంది.
రామ్‌చరణ్‌తో కలసి చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ కనుసన్నల్లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే థియేటర్లలో మాత్రం సినిమాకు సరైన విజయం దక్కలేదు. వింటేజ్ చిరంజీవిని చూపిస్తారని అందరూ అనుకుంటే బోరింగ్ సినిమాను చూపించారు అని కొరటాలకు విమర్శల బాంబులు పడుతున్నాయి. అయినా చిరు కెరీర్‌లో ఇలాంటి ఫ్లాప్‌లు పెద్ద విషయం కాదు. గతంలో ఎన్నో చూశారు. వాటిని దాటి ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చారు కూడా.
అలాంటి చిరంజీవిని ఒక్క సినిమా ఫలితంతో లెక్క గట్టడం సరికాదు అని అంటున్నారు అభిమానులు. సినిమా బాగాలేకపోతే బాగోలేదు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ పూర్తి చిరంజీవి నటనను, గ్రేస్‌ను, డ్యాన్స్, ఫైట్స్‌ను నిందించడం తగదంటున్నారు. సినిమాలో చిరంజీవి ఎక్కడ ఒళ్లు దాచుకొని ఉండిపోలేదు. తనకు దర్శకుడు అవకాశం ఇచ్చిన ప్రతి సన్నివేశంలోనూ అదరగొట్టారు. అయితే చిరంజీవి లాంటి నటుడిని పెట్టుకొని సరైన సినిమా రాసుకోలేకపోవడం ఎవరి తప్పిదమో వాళ్లకే తెలుసు.
అయినా ఇప్పుడున్న స్టార్ హీరోల్లో చిరంజీవిలా వరుసగా ఇండస్ట్రీ జనాలకు సినిమాలు తద్వారా పనులు అందిస్తున్న చిరంజీవినే. చిరు లైనప్ చూస్తేనే తెలిసిపోతుంది. ‘గాడ్‌ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్ మీద ఉన్నాయి. వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య సినిమా ఇటీవల అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఓకే చేశాడని సమాచారం. ఒకటి రాధిక నిర్మాణంలో ఉండగా, రెండోది తనయ సుస్మిత నిర్మాణంలో ఉంటుందంటున్నారు.
అలా పరాజయాలకు పడిపోకుండా వరుస సినిమాలు చేసే చిరంజీవిని మనం గతంలోనూ చూశాం. ఇప్పుడు చూస్తున్నాం. ఆయనకు ఓపిక ఉన్నంతవరకు సినిమాలు చేస్తారు. అయినా పరాజయాలు లేని హీరోలు ఎవరున్నారు. ఆ ఒక్క ఫ్లాప్ వాళ్ల కెరీర్‌ను ఆపేస్తే ఈ రోజు ఇండస్ట్రీలో హీరోలే ఉండేవారు కాదు. ఏమంటారు మరి. ‘ఆచార్య’ లాంటి ఒక్క ఫ్లాప్‌తో చిరంజీవి కెరీర్ ముగించేయాలా?