Pawan Kalyan: పవన్‌ గ్యాప్‌ ఇవ్వడం లేదు.. అయితే ఆ బంపర్‌ ఆఫర్‌ వారికి మాత్రమే!

మామూలుగా అయితే సినిమాలకు లైనప్‌ ఉంటుంది. అంటే ఏ సినిమా తర్వాత ఏది అనే ఓ లెక్క ఉంటుంది. దానికి పెద్ద కొలతలు, కౌంట్‌లు ఏమీ ఉండవు. ఏది ముందు మొదలుపెడితే అది ముందు పూర్తయి విడుదలవుతుంది. ఆ తర్వాత మరో సినిమా పట్టాలెక్కుతుంది. అయితే పవన్‌ కల్యాణ్‌ విషయంలో మాత్రం ఇది పూర్తిగా కొత్తగా ఉంటుంది లెండి. ఎప్పుడో మొదలుపెట్టిన సినిమా అలా పక్కనే ఉండి.. ఆ తర్వాత మొదలైన సినిమాలు పూర్తయి విడుదలైపోతున్నాయి.

ఆఁ మీరు అనుకుంటున్నది కరెక్టే. ‘హరి హర వీర మల్లు’ గురించే మేం చెబుతున్నది. చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా జూన్‌ రెండో వారంలో షూటింగ్‌ అన్నారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’ షూటింగ్‌ మొదలైంది. మూడో షెడ్యూల్‌ స్టార్ట్‌ చేశాం అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. దీంతో ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.

మొన్నటివరకు ‘బ్రో’ సినిమాకు వరుసగా కాల్షీట్లు కేటాయించాడు (Pawan Kalyan) పవన్ కల్యాణ్. ఇప్పుడు ‘ఓజీ’ సినిమాకు అదే విధంగా కాల్షీట్లు ఇస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పట్నుండి పవన్ కల్యాణ్ గ్యాప్ ఇవ్వడం లేదు. ఫస్ట్ షెడ్యూల్ ముంబయి, పుణె పరిసర ప్రాంతాల్లో జరిగింది. లెక్కప్రకారం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పవన్ జాయిన్ అవ్వాలి. పోనీ ఆ తర్వాతైనా షూటింగ్‌ ఉంటుందా అంటే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా షూటింగ్‌ ఉంటుంది అంటున్నారు.

మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ‘హరి హర వీరమల్లు’ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus