సినిమాలో రెమ్యూనరేషన్ చర్చ ఎక్కువగా హీరోయిన్ల గురించే ఉంటుంది. ‘ఆ హీరోయిన్‌కి అంతిస్తున్నారట.. ఈ హీరోయిన్‌కి ఇంతిస్తున్నారట’ అనే మాటలే ఎక్కువగా వింటూ ఉంటాయి. ఈ చర్చలోకి హీరోలు రావడం చాలా అరుదు. అయితే ఇటీవల కాలంలో హీరోల రెమ్యూనరేషన్ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ హీరోల రెమ్యూనరేషన్. కోట్ల రూపాయలు ఇచ్చి తమిళ హీరోలను మన నిర్మాతలు లాక్ చేస్తున్నారని అంటున్నారు. అసలు ఇదెంతవరకు నిజం కావొచ్చు.
తమిళ స్టార్ హీరోలతో మన నిర్మాతలు సినిమాలు చేయాలని అనుకోవడం కొత్త విషయం కాదు, అందులోనూ ఆశ్చర్యపోచే విషయం కాదు. ఎందుకంటే తమిళ హీరోలను మన ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. మన హీరోలను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారా… అంటే నో కామెంట్ అనే చెప్పాలి. దీంతో బైలింగ్వుల్, ట్రై లింగ్వల్, పాన్ ఇండియా అంటూ మన నిర్మాతలు ఆలోచన చేసినప్పుడు గుర్తొచ్చే హీరోలు తమిళ స్టార్లే. అలా ఇటీవల కాలంలో మన నిర్మాతలు, దర్శకులు తమిళ స్టార్ల వెంట పడుతున్నారు.
విజయ్, ధనుష్, సూర్య అంటూ… మన నిర్మాతలు ఇటీవల కాలంలో బాగా కలవరిస్తున్నారు. వారితో సినిమా చేసి రెండు మార్కెట్లలోనూ మంచి వసూళ్లు సాధించాలనేది మన నిర్మాతల ఆలోచన. అయితే ఈ క్రమంలో వారికి ₹50 కోట్లు, ₹100 కోట్లు ఇస్తున్నారు అంటూ పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రశ్రేణి స్టార్ హీరోలకు అంత ఇవ్వడం లేదు. అలాంటిది అక్కడ స్టార్ హీరోలకు ఇంతేసి ఇస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇదంతా సినిమా హైప్ కోసమే అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు.
సినిమా వాళ్ల రెమ్యూనరేషన్ల విషయంలో ఎక్కడా అధికారిక లెక్కలు ఉండవు. కొంతమొత్తం డబ్బు, ఇంకొంత మొత్తం లాభాల వాటా అంటూ ఓ లెక్క చెబుతారు తప్ప. ‘ఇంతిచ్చాం మా హీరోకు’ అని ఏ నిర్మాతా చెప్పరు. ఈ సమయంలో హీరోల రెమ్యూనరేషన్ లెక్కలు అనవసరమైన కన్‌ఫ్యూజనే. తిరిగి తమిళ హీరోలకు మన హీరోల కంటే ఎక్కువ ఇస్తున్నారు అనే మాటా మంచిది కాదు. అయినా ఆఖరి మాట… పాన్ ఇండియా, బై లింగ్వుల్, ట్రై లింగ్వుల్ సినిమాలకు మన హీరోలు సరిపోరా… మన దగ్గర చాలా మంది హీరోలు ఉన్నారుగా!
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?