Chiranjeevi: ‘వకీల్ సాబ్’ గురించి చిరు పట్టించుకోవడం లేదట..!

రాజకీయాల విషయంలో గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. అయితే అది సినిమాల వరకూ పోనివ్వము అని వారు చెప్పారు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కూడా.. ‘రాజకీయాల పరంగా మా ఆలోచన ధోరణి వేరు కానీ మా అన్నదమ్ముల మధ్య ఎటువంటి బేధాలు లేవు’ అంటూ చాలా సినిమా వేడుకల్లో స్పష్టంచేశారు. ఇక కొద్ది రోజుల తరువాత పరిస్థితి అన్ని రకాలుగాను సెట్ అయిపోయింది. చిరు, పవన్ కళ్యాణ్ లు తరుచూ కలుస్తూనే ఉన్నారు.

‘సైరా నరసింహరెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకకి పవర్ స్టార్ హాజరయ్యాడు. ఆ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. తన అన్న సినిమాకి తన వంతు.. ఎంత చెయ్యాలో అంతా చేసాడు. అయితే తమ్ముడు సినిమాల్లో కొనసాగాలి అని కోరుకున్న అన్న చిరంజీవి మాత్రం ఇప్పుడు ఎందుకో సైలెంట్ గా ఉన్నట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అన్ని అంశాల పై స్పందిస్తున్నారు. ముఖ్యంగా చిన్న హీరోల సినిమా ట్రైలర్లను, టీజర్లను విడుదల చేసి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాని కూడా ప్రమోట్ చేశారు చిరు.

అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా పై చిరు స్పందించడం లేదు. ట్రైలర్ విడుదలైనప్పుడు చిరు నుండీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసో.. లేదా మీట్ అయ్యో.. విషెస్ చెప్పి ఉండచ్చు. కానీ అభిమానుల సంతోషం కోసం సోషల్ మీడియాలో కూడా ‘వకీల్ సాబ్’ గురించి స్పందిస్తే బాగుంటుంది కదా అని కొందరి అభిప్రాయం. చూద్దాం రేపు సినిమా విడుదలైన తరువాత చూసి ఏమైనా స్పందిస్తారేమో..!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus