ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ లో నభా అందుకే కనిపించలేదు

ఈమధ్యకాలంలో భీభత్సమైన బ్లాక్ బస్టర్ సొంతం చేసుకొన్న ఏకైక చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఆ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ చూసి టీం మెంబర్స్ మాత్రమే కాదు.. ట్రేడ్ ఎనలిస్ట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే 75 కోట్ల రూపాయల గాస్ ను కలెక్ట్ చేసిన ఈ చిత్రం 80 నుంచి 85 కోట్ల గ్రాస్ వరకు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకే.. “ఇస్మార్ట్ శంకర్” టీం మెంబర్స్ బ్రహ్మోత్సవాల తరహాలో రోజూ పార్టీలు, సక్సెస్ మీట్ లు చేసుకుంటూనే ఉన్నారు. కానీ.. ఈ పార్టీల్లో, ప్రమోషనల్ ఈవెంట్స్ లో నభ నటేష్ మాత్రం కనిపించడం లేదు.

నిజానికి “ఇస్మార్ట్ శంకర్” చిత్రం సాధించిన విజయంలో తన అందం-అభినయంతో కీలకపాత్ర పోషించిన హీరోయిన్ నభ నటేష్. అలాంటిది ఆమె ప్రమోషన్స్ లో కనిపించకపోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. రవితేజ డిస్కో రాజా సినిమాలో అమ్మడు బిజీగా ఉంది కాబట్టి కుదరలేదు అని కవర్ చేశారు. అయితే.. అసలు విషయం ఏంటంటే.. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ పార్టీలో టీం మెంబర్స్ చాలా మంది నభాపై బీర్, మందు పోశారు. ఆ కారణంగా ఆమె హెల్త్ కాస్త డిస్టర్బ్ అయ్యిందట. దిమాక్ ఖరాబ్ చేసిన పోరి ఆరోగ్యం ఖరాబ్ అవ్వడమే ఆమె ప్రమోషన్స్ కి దూరంగా ఉండడానికి కారణం అన్నమాట. అమ్మడు ప్రస్తుతం డిస్కో రాజా షూటింగ్ కోసం ఢిల్లీలో ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus