Jr NTR: చరణ్‌, ఎన్టీఆర్‌ ఇక్కడ ఇరుక్కుపోయాడా? బాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడు?

‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) సినిమాతో పాన్‌ ఇండియా హీరోలు అయిపోయిన (Ram-Charan) రామ్‌చరణ్‌, (Jr NTR) ఎన్టీఆర్‌… వెంటనే బాలీవుడ్ సినిమానో లేక పాన్‌ ఇండియా సినిమానో స్టార్ట్‌ చేసేస్తారు అని అన్నారు. కానీ ఇంతవరకూ లేదు. ప్రస్తుతం సెట్స్‌ మీదున్న రెండు సినిమాలు పాన్‌ ఇండియాలే అంటున్నారు కానీ ట్రూ బ్లూ పాన్‌ ఇండియా కాదు. అంటే ప్రభాస్‌ లాగా పక్క భాషల భారీ చిత్రాల దర్శకులతో సినిమాలు చేయడం అన్నమాట. చరణ్‌ విషయంలో కొంతమంది బాలీవుడ్‌ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

తారక్‌ విషయంలో అయితే ఏకంగా సినిమా పేరే వచ్చింది. కానీ ఇంకా ఏదీ ఓకే అవ్వలేదు. అదేంటి తారక్‌ ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పేశారు కదా అంటారా? అవును చెప్పేశారు అయితే అది పుకారుగా మాత్రమే. ఇంతవరకు టీమ్‌ నుండి అధికారిక సమాచారం లేదు. అలాగే ఎన్టీఆర్‌ కూడా ఫలానా సినిమాలో నటిస్తున్నా అని చెప్పలేదు. ఇప్పుడేమో ఏకంగా ‘వార్‌ 2’ మాత్రమే కాదు ఆ ఫ్రాంచైజీలో తారక్‌ కంటిన్యూ అవుతాడు అని ఓ పుకారు మొదలైంది.

దీంతో ఇంకెన్నాళ్లు ఈ పుకార్లు.. ఏదో విషయం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వస్తే బాగుండు అంటున్నారు అభిమానులు. ఇక చరణ్‌ విషయానికొస్తే బాలీవుడ్‌లో చరణ్‌ సినిమా అంటూ చాలా నెలలుగా వార్తలొస్తున్నాయి. చెర్రీ కూడా ముంబయి వెళ్లి వస్తున్నాడు. అయితే ఎక్కడా ఏ సినిమా కూడా ఓకే అవ్వలేదు. సంజయ్‌ లీలా భన్సాలీ అని ఒకసారి, రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) అని మరోసారి, కాదు కాదు విధు వినోద్‌ చోప్రా అని మరోసారి పేర్లు వచ్చాయి.

కానీ ఇంకా ఏదీ ఓకే అవ్వడం లేదు. అనౌన్స్‌మెంట్ రావడం లేదు. నిజానికి చరణ్‌ ఇప్పటికే బాలీవుడ్‌ వెళ్లాడు ‘తుఫాన్‌’ (Thoofan) సినిమాతో. దీంతో ఈ ఇద్దరి అభిమానుల్లో ‘పుకార్లు ఆపి ప్రకటన ఇవ్వండి’ అనే మాట వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ తెలుగు సినిమాల షెడ్యూల్స్‌ మధ్య ఉండిపోయారని, అవే బాలీవుడ్‌ ప్రకటనకు అడ్డు అంటున్నారు. తారక్‌ ‘దేవర’ (Devara) చేస్తుండగా… చరణ్‌ (Game Changer) ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నాడు. బుచ్చిబాబు సానా సినిమా కూడా ఉంది.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus