OG Twitter Review: ‘ఓజి’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కి పండగే.. మాస్ బ్యాటింగ్ షురూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమా సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాత్రి 10 గంటల నుండే ప్రీమియర్ షోలు వంటివి ప్రారంభం కానున్నాయి. టికెట్ల కోసం అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. బుక్ మై షోలో బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. ఈ వీకెండ్ వరకు ‘ఓజి’ కి సాలిడ్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘ఓజి’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ‘హంగ్రీ చీతా’ పేరుతో వచ్చిన గ్లింప్స్ కానీ టీజర్, ట్రైలర్, పాటలు వంటివి ‘ఓజి’ కి బోలెడంత హైప్ తీసుకొచ్చాయి.

OG Movie Twitter Review

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ‘డిజె టిల్లు’ బ్యూటీ నేహా శెట్టి, శ్రీయ రెడ్డి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ గా నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇదిలా ఆల్రెడీ చాలా చోట్ల ‘ఓజి’ షోలు పడ్డాయి.

సినిమా చూసిన వారంతా స్క్రీన్ షాట్లు, వీడియోలు వంటివి తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే సినిమా అనంతరం.. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘ఓజి’ సినిమా కథ ముంబైలో స్టార్ట్ అవుతుందట. తర్వాత కలకత్తాకి షిఫ్ట్ అవుతుంది అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి సినిమా అందరినీ కట్టి పడేస్తుందట.

సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ సినిమాకి హైలెట్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ శ్వాగ్, సుజిత్ డిజైన్ చేసిన ఎలివేషన్ సీన్స్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకి ప్రధాన ఆకర్షణలు అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus