పవన్ కళ్యాణ్ ఆ మాట మాత్రం చెప్పడం లేదు ఎందుకు?

ప్రస్తుతం ‘జనసేన’ పార్టీని బలోపేతం చేసే పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా మరోపక్క హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు నిర్మాత దిల్ రాజు. అయితే ఈ విషయం పై పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ దిల్ రాజు మాత్రం ‘ఇది నా 20 ఏళ్ళ కల. త్వరలోనే ఉంటుంది’ అని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.

ఇదిలా ఉంటే… పవన్ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆదాయం కోసం సినిమాలు నిర్మిస్తానని మాత్రమే చెబుతుండడం గమనార్హం. ‘కచ్చితంగా రాంచరణ్ తో ఓ సినిమా నిర్మిస్తానని’ చెప్పారు. మంచి కథ, ద‌ర్శ‌కుడు కోసం ఎదురుచూస్తున్నట్టు కూడా తెలిపాడు. అయితే ‘పింక్’ రీమేక్ సంగతి మాత్రం ఆయన చెప్పడం లేదు. అసలు ఎందుకు ఇలా హైడ్ చేస్తున్నారు అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే పలుమార్లు సినిమాలు చేయను అంటూ చెప్పడం వలనే ఇలా మౌనంగా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో..!

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus