Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

విలన్లను వారి రౌడీలను హీరో వచ్చి శత్రు సంహారం చేసినప్పుడు.. విచక్షణారహితంగా చంపడానికి ఓ లైసెన్స్‌ కావాలి. అంటే హీరో ఎంత క్రూరంగా ఆ రౌడీలను చంపినా ప్రేక్షకులు ‘హీరో కరెక్ట్‌గా చేశాడు’ అని అనుకోవాలి. దీని కోసం మన దర్శకులు ఆ రౌడీలు, విలన్లతో కొన్ని భయానక సన్నివేశాల్లో నటింపజేస్తారు. ప్రజల్ని చిత్ర హింసలు పెట్టడం, హీరో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయిస్తారు. ఎన్నో ఏళ్లుగా మన ఇండియన్‌ సినిమాలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం.

Pregnant Ladies Scenes

అయితే, గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఇంకా మారుతోంది. రౌడీలు/ విలన్ల చేష్టలు చూస్తే ప్రేక్షకుడికి వారిపై కోపం రావడం కంటే.. ఇంత దారుణంగా ఆ సీన్‌ తీయాలా అనే కోపం దర్శకుడి మీద వచ్చేలా మారింది. ఎందుకంటే వారు ఇబ్బంది పెడుతోంది గర్భిణీ స్త్రీలను. కావాలంటే మీరే చూడండి. రీసెంట్‌గా వచ్చిన ‘జైలర్‌ 2’, అంతకుముందు వచ్చిన ‘రణబాలి’, దాని కంటే ముందు వచ్చిన ‘ప్యారడైజ్‌’. ఈ మూడు సినిమాల్లోనూ గర్భిణీలను హింసించే సీన్స్‌ ఎక్కువైపోయాయి.

ఆ సీన్‌ లేకపోతే సినిమా ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో దర్శకులు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, రాహుల్‌ సాంకృత్యాన్‌, శ్రీకాంత్‌ ఓదెల ఎందుకు ఆలోచించలేదో అర్థం కావడం లేదు. ఈ ముగ్గురి పేర్లు చెప్పామని వీరినే అడుగుతున్నట్లు కాదు. రీసెంట్‌గా ఈ ముగ్గురి సినిమాలు వచ్చాయి కాబట్టి. ఎన్నెన్నో సీన్స్‌ ఆపుతూ, సినిమాలను హోల్డ్‌లో పెడుతూ వస్తున్న సెన్సార్‌ బోర్డు ఈ సీన్స్ విషయంలో ఎందుకు ఊరుకుంటుందో వారికే తెలియాలి.

మహిళలను, కావాల్సిన వారిని ఇబ్బంది పెట్టినట్లు చూపించడం, దాని ద్వారా విలనీని పెంచి చూపించి.. హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడం ఓకే. కానీ ఇది ఎంతవరకు అనేది చూడాలి. లేకపోతే ఆ సీన్స్‌ కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకు దూరం చేస్తాయి. ఎందుకంటే వారి చేతిలో రిమోట్‌, స్క్రోల్‌ బార్‌ ఉండవు కాబట్టి.

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus