సినిమాల గురించి రివ్యూలు రాసేవాళ్లకు… సినిమాలు తీయడం తెలియాలా? సినిమాల గురించి సమీక్షలు చేసేవాళ్లకు అదనపు స్కిల్స్ ఉండాలా? ఈ చర్చ ఇప్పటిది కాదు… ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో డిస్కషన్ నడుస్తూనే ఉంది. సినిమా ఎలా ఉందో చెప్పడానికి… ఓ వీక్షకుడిగా చూస్తే చాలు అని సమీక్షకులు అంటే.. కాదు కాదు అలా మీరు అనకూడదు, మీకు అన్నీ తెలియవు అని సినిమా జనాలు అంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది కాస్త నోటి దురుసు చూపిస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి దర్శకుడు సందీప్ వంగా కూడా చేరారు. ‘యానిమల్’ సినిమాతో ఇటీవల పాన్ ఇండియా లెవల్‌లో భారీ విజయం అందుకున్న ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివ్యూల గురించి, రివ్యూయర్‌ల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది అయితే ఇలా ఎందుకు మాట్లాడారు అని సాఫ్ట్‌గా అంటుంటే… మరికొందరేమో ‘వంగాజీ ఏంటీ నోటి దురుసు’ అని కామెంట్ చేస్తున్నారు.
‘‘కబీర్‌సింగ్’ విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని విమర్శించి ఫేమ్ పొందాలని చూశారు. ఆ సినిమా క్రాఫ్ట్, ఎడిటింగ్, సౌండ్ గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్లకు సినిమా గురించి ఏమీ తెలియదు. ఒక చిత్రాన్ని ఎలా విమర్శించాలి? లేదా ఒక చిత్రాన్ని ఎలా రివ్యూ చేయాలి? అనే విషయాలు వాళ్లకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్లంతా సినిమాల విషయంలో నిరక్షరాస్యులు’’ అంటూ కాస్త ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అక్కడితో ఆగకుండా ‘‘దాదాపు ఐదేళ్ల నుండి తాను ముంబయిలో ఉంటున్నానని.. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ డబ్బులు ఇచ్చి మరీ తమ సినిమాలపై రివ్యూలు రాయించుకుంటారు’’ అంటూ విమర్శించారు. ఆయన ఎవరి గురించి ఇలా అన్నారో తెలియదు కానీ… మొత్తం రివ్యూయర్ల మీద ఇలా మాట్లాడటం సరికాదు అని కామెంట్స్ వస్తున్నాయి. సినిమా ఎలా ఉందో చెప్పడానికి సినిమా తీయడం రానక్కర్లేదు అని మరోసారి గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!