AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ రైటింగ్‌ గురించి పేరు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆయన మాటలు ఒక్కోసారి తూటాలు అవుతాయి. మరోసారి ఈటెలు అవుతాయి. ఇంకోసారి గులాబీలూ అవుతాయి. అలాంటి మాటలు రాస్తాయారన. అయితే ఆయన కథల విషయంలో ఎప్పటి నుండో ఓ విమర్శ ఉంది. అలాగే సన్నివేశాల ఒరిజినాలిటీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ సినిమా టీజర్‌ చూశాక కూడా అవే మాటలు మళ్లీ వినిపిస్తున్నాయి.

AK 47

వెంకటేశ్‌ పాత్రను పరిచయం చేస్తూ.. నిన్న చిత్రబృందం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ రోజు శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ మరో వీడియో విడుదల చేశారు. ఈ వరుసలో రేపు నివేదా పేతురాజ్‌ పాత్రను పరిచయం చేస్తారు. దీంతో ప్రధాన పాత్రలు అయిపోయినట్లే. ఇప్పటివరకు వచ్చిన రెండు పాత్రలు చూస్తే.. ఇంట్లో హీరోయిన్‌దే రాజ్యం.. హీరో అన్ని పనులూ చేస్తుంటాడు. హీరోయిన్‌ నుండి ప్రేమను ఎక్స్‌పెక్ట్‌ చేస్తుంటాడు అని అర్థమవుతోంది. ఇక హీరోయిన్‌ పాత్ర డామినేటింగ్‌ అని అర్థమైపోయింది.

ఇదంతా చూస్తుంటే దర్శకుడు త్రివిక్రమ్‌ జోనర్‌ మార్చారు అనే డౌట్‌ అందరికీ కలుగుతోంది. కొంతమంది అయితే అనిల్‌ రావిపూడి జోనర్‌లోకి వెళ్లి పోయిన త్రివిక్రమ్ అంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్‌లా ఉంది అనేస్తున్నారు కూడా. అయితే ఇవి మాత్రమే కాదు అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ’ ఆధారంగా ఈ సినిమా తీశార‌ని కొందరు అంటున్నారు. మ‌రికొంద‌రేమో ‘వి ఆర్ ద మిల్ల‌ర్స్’ అనే హాలీవుడ్ సినిమాతో పోలుస్తున్నారు. ఇంకొంరు అయితే తమిళ సినిమా ‘బ్లాస్ట్‌’, ‘మొగుడు’ (విశాల్‌ – తమన్నా)తో పోలుస్తున్నారు.

పాత సినిమాలు ముఖ్యంగా విదేశీ సినిమాలను సీన్స్‌ను ఎత్తేయడం త్రివిక్రమ్‌కి ఉన్న అలవాటు. గతంలో ఆయన చేసిన సినిమాల్లో ఏదో ఒక సీన్‌, లేదంటే ఒ ప్లాట్‌ ఇలా ఎత్తేశారు. మరిప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో పుకార్లు నిజమవుతాయా? లేక కొత్తగా ఉంటుందా అనేది చూడాలి..

మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus