Adipurush: మొత్తానికి ఆదిపురుష్ టీమ్ దిగొచ్చింది..!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మరో పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”. జూన్ 16 న హిందీ, తెలుగుతో పాటు తమిళ, మలయాళ , కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. మొదటి రోజు, రెండో రోజు ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదయ్యాయి. “ఆదిపురుష్” మేకింగ్ లోని సాంకేతికత, భారీతనం, విజువల్స్ ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలోని కొన్ని సంభాషణల పై మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హనుమంతుని పాత్రతో నీ బాబు అంటూ డైలాగులు చెప్పించడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి.

ఇది రామాయణాన్ని అపహస్యం చేసినట్టే అని కొందరు భావిస్తున్నారు. దీంతో ఆదిపురుష్ టీమ్ దిగొచ్చింది. ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ “ఆదిపురుష్” చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. సినిమా ఫీల్ ను పక్కదోవ పట్టించే విధంగా కాకుండా ఆ మార్చిన సంభాషణలు ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో “ఆదిపురుష్” ను చూడొచ్చట.

డైలాగ్స్ మార్పులు అనేది సినిమా టీమ్ కు ఒక సాహసం లాంటిదే అయినా ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యమని భావించి దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. అయితే వీకెండ్ కే ఆదిపురుష్ చిత్రాన్ని చాలా వరకు చూసేస్తారు. వీక్ డేస్ లో మార్పులు చేసినా .. ఉపయోగం ఏముంటుంది? అనేది చిత్ర బృందానికే తెలియాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus