Allu Arjun: ఆ దర్శకునికి అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథల ఎంపిక, దర్శకుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే. బన్నీతో సినిమా చేయాలని చాలామంది దర్శకులు కలలు కంటున్నా బన్నీ మాత్రం ఏ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పకుండా దర్శకులను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా బన్నీ జాబితాలో మరో డైరెక్టర్ చేరారని సమాచారం అందుతోంది. బన్నీ పరశురామ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని పరశురామ్ చెప్పిన కథ బన్నీకి నచ్చిందని బోగట్టా.

మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో గతంలో కొన్ని సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు మెడికల్ మాఫియాకు సంబంధించిన అన్ని విషయాలను వెలుగులోకి తీసుకురాలేదు. బన్నీకి నచ్చడంతో ప్రస్తుతం పరశురామ్ ఈ కథపై వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. గీతా గోవిందం, సర్కారు వారి పాట విజయాలు పరశురామ్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం పరశురామ్ నాగచైతన్య హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో కూడా పరశురామ్ సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోలు పరశురామ్ పై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

నాగచైతన్యకు ఈ ఏడాది థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో భారీ షాకులు తగిలాయి. తర్వాత ప్రాజెక్ట్ లతో నాగచైతన్య కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. మరోవైపు బన్నీ పరశురామ్ కాంబో మూవీకి సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. పుష్ప ది రైజ్ సినిమాతో బన్నీకి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus