అనిల్ రావిపూడి పరువు తీస్తున్న ఆ సెంటిమెంట్..?

  • March 18, 2021 / 07:22 PM IST

ఏ రంగంలోనైనా సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారో లేదో తెలీదు కానీ సినిమా రంగంలో మాత్రం సెంటిమెంట్లను బలంగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్లలో కొన్ని హిట్ సెంటిమెంట్లు అయితే మరికొన్ని ఫ్లాప్ సెంటిమెంట్లు కావడం గమనార్హం. దర్శకుడు అనిల్ రావిపూడికి సంబంధించిన ఒక సెంటిమెంట్ గురించి తెలిసి ఆయన ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఐదు సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ ఐదు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కి గతేడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనిల్ రావిపూడి రచయితగా పని చేసిన సినిమాలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. శివరాత్రి పండుగకు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన గాలిసంపత్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

బాస్, ఆగడు, మసాలామ్ మరికొన్ని సినిమాలకు అనిల్ రావిపూడి రైటర్ గా పని చేయగా ఆ సినిమా ఫలితాలు మనందరికీ తెలిసిందే. భవిష్యత్తులోనైనా అనిల్ రావిపూడి ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. దర్శకుడిగా విజయాలు సొంతం చేసుకుంటూ రచయితగా మాత్రం ఫెయిల్ అవుతున్న అనిల్ రావిపూడి గురించి తెలిసి అతని ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం అనిల్ రావిపూడి కథలను ఆయన మాత్రమే పర్ఫెక్ట్ గా తెరకెక్కించగలరని ఇతర డైరెక్టర్లు తెరకెక్కించలేరని కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus