Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ సినిమా ఇప్పటి విషయం కాదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఆ ప్రాజెక్ట్‌ ఓకే అయిపోయింది. ఆ సినిమాకు సంబంధించి రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ కూడా ఇప్పటికే తెరకెక్కించారు. అయితే సినిమా ఇంకా కొబ్బరికాయ కొట్టుకోలేదు. త్వరలో ఆ పనులు లాంఛనంగా చేసేయాలని టీమ్‌ అనుకుంటోంది. ఈ క్రమంలో ఓ పాత ప్రామిస్‌ గురించి చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో జరుగుతోంది. అది ఓ హీరోయిన్‌కి సుకుమార్‌ ఇచ్చిన మాట కావడం గమనార్హం.

Anupama Parameswaran

‘పుష్ప’ సినిమాలతో గత కొన్నేళ్లుగా బిజీగా ఉన్న సుకుమార్‌ ఇప్పుడు కావాల్సినంత రెస్ట్‌ తీసుకొని తిరిగి సినిమా పనుల్లో బిజీ అవుతున్నారు. రామ్‌చరణ్‌ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌, కంటెంట్‌ పనుల్లో జోరుగా పనులు చేపడుతున్నారు. ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన అన్ని పనులు అయితేపోతే అప్పుడు సుకుమార్‌ సినిమా స్టార్ట్‌ చేయాలని రామ్‌చరణ్‌ అనుకుంటున్నారట. దీంతో అనుపమ పరమేశ్వరన్‌ టాపిక్‌ చర్చలోకి వచ్చింది.

రామ్‌ చరణ్ – సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాలో తొలుత కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ పాత్రకు కొత్త హీరోయిన్‌ కంటే కాస్త పేరున్న హీరోయిన్‌ కావాలి అని సమంతను తీసుకున్నారు. ఆ సమయంలో అనుపమ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఆ తర్వాత మరో సినిమా ప్రచారంలో పాల్గొన్న సుకుమార్ ఆమెకు ఓ మాటిచ్చాడు. అనుపమలో టాలెంట్ ఉందని, కచ్చితంగా ఆమెను ఓ సినిమాలో తీసుకుంటానని ప్రకటించారు.

మరి ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. అనుపమ లైమ్ లైట్లోనే ఉంది. దీంతో ఈసారైనా సుకుమార్ ఛాన్స్ ఇస్తారా? అనే డిస్కషన్‌ సాగుతోంది. మరి కుర్ర హీరోయిన్లతో ప్రాజెక్ట్‌లు సెట్‌ చేస్తున్న ఈ రోజుల్లో అనుపమ పరమేశ్వరన్‌ లాంటి సీనియర్‌ హీరోయిన్‌ ఎంపిక చేస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. చూద్దాం మరి సుకుమార్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో?

కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus