తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాలు జోరందుకున్నాయి. స్టార్ హీరోలు మాత్రమే కాదు యువ హీరోలు కలిసి నటించడానికి ఆసక్తి కనిపిస్తున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శమంతకమణి. ఇందులో నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది వంటి నలుగురు యువ హీరోలున్నారు. వీరితో పాటు సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఐదుమంది హీరోలు ఒకే సినిమాలో ఉండడం వల్ల సినిమాపై క్రేజ్ పెరిగింది. ఈ చిత్రంతో పాటు క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన నక్షత్రం సినిమాలోనూ నలుగురు హీరోలున్నారు. సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తనీష్ విలన్ గా కనిపించనున్నారు. మరో ప్రత్యేక పాత్రను గడ్డం చక్రవర్తి పోషించారు.
ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం ఎప్పటికీ మంచిదే.. కానీ ఇద్దరు కంటే ఎక్కువమంది హీరోలు ఒకే సినిమాలో కనిపించడం వల్ల సినిమాకి ప్లస్ కంటే మైనస్ ఎక్కువగా ఉంది. ప్రతి ఫ్రెమ్ రిచ్ గా కనిపిస్తుంది. ఇదొక్కటే ప్లస్. ఇక మైనస్ ఏమిటంటే అందరికీ కథలో సమానమైన ప్రయారిటీ ఇవ్వలేకపోతారు. కొన్ని సార్లు కథలో గందరగోళం కూడా నెలకొనే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ సినిమాలు మెప్పిస్తాయా? లేదా ? అని సినీ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫలితం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.