సినిమా ఏదైనా, ప్రచారం ఎవరిదైనా… నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వచ్చారు అంటే కచ్చితంగా ‘గుంటూరు కారం’ సినిమా గురించే అవుతుంది. ఒక సినిమా గురించి వేరే సినిమా ప్రచారంలో అడగడం సరికాదు అంటుంటారు. కానీ ఆయనకు అలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఆయన చెప్పాల్సి ఉంటుంది కూడా. అయితే దీని వెనుక కారణం ఉందట. కానీ ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో జరిగింది. తాజాగా నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వస్తే ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.
మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. 13 ఏళ్ల తర్వాత మహేష్ – గురూజీ కాంబో సెట్ అయ్యింది. అందుకు తగ్గట్టే భారీ కథతో ప్రారంభం అయినా… ఆ తర్వాత మార్చుకుంటూ వచ్చారు. ఒక షెడ్యూల్‌ను స్క్రాప్ చేసి మరీ కొత్త కథో సినిమా షురూ చేశారు అంటున్నారు. అయితే సినిమా టీమ్ నుండి సరైన ప్రచారం లేదు. ఒకట్రెండు లుక్‌లు, చిన్నపాటి వీడియో తప్ప ఇంకేం అప్డేట్ రావడం లేదు.
దీంతో సినిమా అప్డేట్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు రోజూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను అడుగుతున్నారు. నాగ వంశీ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో తొలి సాంగ్ విడుదలకు సంబంధించి. ఈ పాట పర్ఫెక్ట్గా వచ్చేలా కొన్ని మార్పులు, చేర్పులు రెడీ అవుతున్నాయని… వన్స్ వచ్చాక ఆ టీజర్ లాంచ్ ఉండేలా చూసుకుంటా అని చెప్పారట. దీంతో ఒక్క పాట విషయంలో సుమారు నెల రోజులు సమయం పడితే… ఇక సినిమా మొత్తం పూర్తి చేసి బయటకు తీసుకురావడానికి సమయం పడుతుంది అని అంటున్నారు. మరి పాత ఎన్నికల పేజీ పోయినట్లే కదా.
పాట పర్ఫెక్ట్గా రావడానికే టైమ్ తీసుకుంటున్నారు? మరి మొత్తం (Guntur Kaaram) సినిమా సంగతి చూస్తే… ఇంకెంత సమయం తీసుకుంటారో అనిపిస్తోంది ఫ్యాన్స్‌కి. ఈ లెక్కన గుంటూరు కారాన్ని సంక్రాంతికల్లా దంచి సిద్ధం చేస్తారా అనే ప్రశ్న అడుగుతున్నారు. మరి దీనికి టీమ్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.