చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, ఆయనకు రిమాండ్ విధించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ గురించి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించడం జరిగింది. అయితే చంద్రబాబు అరెస్ట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
కొన్నిసార్లు తారక్ స్పందించినా ఆ సమయంలో తారక్ స్పందించిన తీరును కొంతమంది కావాలనే వివాదాస్పదం చేశారు. అందువల్ల తారక్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో స్పందించే అవకాశాలు అయితే లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందిస్తే కొత్త వివాదాలు మొదలవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో (Jr NTR) తారక్ నటించనున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా సినిమాలపై మాత్రమే ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రస్తుతం తారక్ భావించడం లేదు. అందువల్ల రాబోయే రోజుల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అడుగులు ఏ విధంగా ఉంటాయో తెలియాల్సి ఉంది. దేవర సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ విజువల్ వండర్ గా తెరకెక్కుతోందని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు ఊహించని స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేయనుందో చూడాల్సి ఉంది.