మొన్న జరిగిన జనతా గ్యారేజ్ ఆడియో వేడుక అంగరంగా వైభవంగా అభిమానుల కోలాహాలం మధ్య జరిగింది. అయితే అప్పటికీ ఆ సినిమా టీజర్, ఫర్స్ట్ లుక్, అభిమానులను అలరించడం, అదే రోజు విడుదలయిన ఆ సినిమా టీజర్ అభిమానులకే కాదు, ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఎన్టీఆర్, కొరటాల మాట్లాడిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ఈ సినిమా సూపర్ హిట్ ఆవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.
ఇదిలా ఉంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే దర్శకుడి కొరటాల స్థానంలో మార్పు వస్తుంది అని తెలుస్తుంది…విషయం ఏమిటంటే…ఈసినిమా ‘బ్లాక్ బస్టర్’ హిట్ తో జూనియర్ టాప్ వన్ స్థానం వైపు దూసుకుపోతాడు అన్న విశ్లేషణ అందరికీ తెలిసిందే. అయితే అన్నింటి కంటే ముఖ్యంగా టాప్ దర్శకుల జాబితాలో నెంబర్ గేమ్ ను మార్చే చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ ఫలితం ఉండబోతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటి వరకు తెలుగులో నెంబర్ 1 దర్శకుడు ఎవరు ? అని అంటే ముక్తకంఠంతో అందరూ చెప్పే పేరు రాజమౌళి మాత్రమే. ఈ విషయంలో ఎటువంటి వివాదాలు లేవు.
అయితే సమస్య అంతా టాలీవుడ్ దర్శకులకు సంబంధించిన ‘రెండవ స్థానం’ గురించే. రాజమౌళి తరువాత స్థానం తీసుకునే దర్శకులలో త్రివిక్రమ్, బోయపాటి, పూరీ జగన్నాధ్, ల పేర్లు వినిపిస్తున్నా వారెవ్వరూ కొరటాల శివ మాదిరిగా వరస విజయాలను అందుకోలేక పోతున్నారు. అయితే ఇప్పటికే రెండు బ్లాక్ బష్టర్ హిట్స్ ఇచ్చిన కొరటాల ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం జక్కన్న తరువాత స్థానాన్ని అందుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.