Nandamuri Mokshagna :నందమూరి మోక్షజ్ఞ ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారా?

  • June 14, 2023 / 02:01 AM IST

నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఏడాదే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ మొదలుకానుంది. మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుల జాబితాలో పూరీ జగన్నాథ్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, మరి కొందరు డైరెక్టర్లు ఉన్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలయ్య దర్శకత్వం వహించే ఛాన్స్ కూడా ఉందని వార్తలు వినిపించాయి.

అయితే నందమూరి మోక్షజ్ఞ స్లిమ్ లుక్ తో ప్రేక్షకులను మెప్పిస్తుండగా నందమూరి హీరోలలో నంబర్ వన్ గా నిలవడం మోక్షజ్ఞకు సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటే మాత్రం ఈ నందమూరి హీరోకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఎంట్రీ ఇచ్చిన హీరోలలో చాలామంది హీరోలు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు.

నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) మాత్రం ఆ హీరోలకు భిన్నంగా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని హీరోగా కచ్చితంగా సక్సెస్ కావడం ఖాయమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో మోక్షజ్ఞ సైతం కెరీర్ ను అదే విధంగా ప్లాన్ చేసుకోనున్నారని తెలుస్తోంది.

నందమూరి ఫ్యామిలీ స్థాయిని పెంచే విధంగా మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఉండనుందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ కెరీర్ తొలినాళ్లలో సొంత బ్యానర్ లో నటిస్తాడని ఆ తర్వాత బయటి బ్యానర్లలో నటిస్తాడని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ ఫ్యాన్స్ ఆశలను కచ్చితంగా నెరవేరుస్తాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మోక్షజ్ఞ కొత్త లుక్ గురించి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus