Nani: హాయ్ నాన్న మూవీతో నాని ఆ క్లబ్ లో చేరడం సాధ్యమేనా?

  • October 3, 2023 / 05:53 PM IST

న్యాచురల్ స్టార్ నాని తన న్యాచురల్ యాక్టింగ్ తో సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా సినిమాతో నాని మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో నిర్మాతకు లాభాలు వచ్చినా మరీ భారీ స్థాయిలో లాభాలు అయితే రాలేదనే సంగతి తెలిసిందే. నాని వరుసగా విజయాలు సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు.
నాని సినిమాలలో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచాయి.

ఈ జాబితాలో దేవదాస్, గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి ఉన్నాయి. వి, టక్ జగదీష్ సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో విడుదల కాకపోయి ఉంటే మాత్రం భారీ నష్టాలను మిగిల్చేవి. నాని కెరీర్ లో ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమా అయితే లేదనే సంగతి తెలిసిందే. హాయ్ నాన్న సినిమాతో నాని ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హాయ్ నాన్న మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

నాని (Nani) పారితోషికం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నాని సినిమాలు నిర్మాతలకు మరీ భారీ లాభాలను అయితే అందించడం లేదు. ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. నాని హాయ్ అక్టోబర్ అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా ఈ సినిమా వార్తల్లో నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్న నాని హాయ్ నాన్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. హాయ్ నాన్న మూవీతో నాని 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరతారో లేదో చూడాలి. నాన్ థియేట్రికల్ హక్కుల మార్కెట్ తగ్గుతున్న నేపథ్యంలో నాని జాగ్రత్త పడితే మంచిదని చెప్పవచ్చు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus