తాజాగా టాలీవుడ్ లో చిన్న సినిమాగా మొదలయ్యి టాప్ హిట్ గా దూసుకుపోయిన సినిమా ఏమైన ఉంది అంటే…ఆది కేవలం “బిచ్చగాడు” సినిమానె. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించింది అంటే…దాదాపుగా 50లక్షల రూపాయలతో ఈ సినిమా తెలుగు రైట్స్ కొనుగోలు కావడం మొదలుకొని దాదాపుగా 25కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా భారీగా ఏమీ ఇవ్వలేదు.
కేవలం మౌత్ పబ్లిసిటీ తోనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడం విశేషం. ఇదిలా ఉంటే…ఈ సినిమా సక్సెస్ తో ఈ మూవీలో నటించిన హీరో విజయ్ ఆంటోని కి తెలుగులో మంచి మార్కెట్ రావడమే కాకుండా నిర్మాతలు సైతం అతనితో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే క్రమంలో విజయ్ ఆంటోని, ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ మూవీని తీయాలని ప్లాన్ చేసుకున్నాడు.
ఈ సినిమాలో ఒక టాప్ హీరోయిన్ ను నటింపజేయాలని ఆలోచనలు చేస్తూ…మంచి కథలని సెలక్ట్ చేసుకునే హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరున్న నిత్య మీనన్ కు ఓ కథని సైతం తెలుపగా…అంతా విన్న నిత్య విజయ్ ఆంటోని ఫీడ్ బ్యాక్ ని తెలుసుకుని డైలమాలో పడిందని సమాచారం…ఈ హీరోతో సినిమా చెయ్యలా వద్దా అన్న ఆలోచనలో నిత్య ఉందని టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం. మరి దీనిపై నిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.