ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఇక ఆయన ‘సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని’ చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేశారు. అలాగే ‘హరిహర వీరమల్లు 2’ ‘ఓజి 2’ ఉంటుందని ప్రకటించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాస్తవానికి ఆ 3 సినిమాలు పూర్తయ్యాక రాజకీయాలకే పరిమితమవుతారని కూడా ఫ్యాన్స్ భయపడ్డారు.కానీ పవన్ వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారనే టాక్ ఇప్పుడు మళ్ళీ వారికి కొత్త ఆశలు రేపుతోంది.
ఈ క్రమంలో మొదట నిర్మాత దిల్ రాజుకు పవన్ డేట్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి ఆ ప్రాజెక్టుని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ లిస్టులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, జనసేన నేత రామ్ తాళ్లూరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దానయ్యతో కూడా పవన్ మరో సినిమా చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే, ‘ఓజీ’ సక్సెస్ మీట్‌లో ఆ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ స్వయంగా ప్రకటించారు కాబట్టి..!
ఇదిలా ఉండగా.. ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, జనసేన నేత రామ్ తాళ్లూరి నిర్మాణంలో పవన్ సినిమా చేస్తానని ప్రకటించి చాలా కాలం అయ్యింది. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రత్యేకంగా ఆఫీస్ ఇచ్చి.. స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టమని చెప్పారు. కానీ ఒక్కచోటే తేడా కొడుతోంది. సురేందర్ రెడ్డి ‘ధృవ’ చిత్రాన్ని అద్భుతంగా రీమేక్ చేశారు. సో పవన్ కళ్యాణ్ తో ఫాస్ట్ గా ఓ రీమేక్ తెరకెక్కించాలని త్రివిక్రమ్.. సూచించారట. కానీ సురేందర్ రెడ్డి మాత్రం స్ట్రైట్ మూవీ చేద్దామని రకరకాల స్టోరీ లైన్లు త్రివిక్రమ్ కి వినిపించాడట. కానీ త్రివిక్రమ్ కి అవి నచ్చడం లేదు. పవన్ ముందడుగు వేయాలంటే.. త్రివిక్రమ్ అప్రూవల్ కావాలి. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తున్నట్టు టాక్.