Pushpa2: నైజాంలో సలార్ కలెక్షన్లను బ్రేక్ చేయడం పుష్ప ది రూల్ కు సాధ్యమేనా?

  • January 5, 2024 / 01:48 PM IST

ఎనిమిదేళ్ల క్రితం వరకు నైజాం ఏరియాలో పెద్ద సినిమా 10 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం కష్టం అని కామెంట్లు వినిపించేవి. ఇప్పుడు పెద్ద సినిమాలు సులువుగా నైజాం ఏరియాలో 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తున్నాయి. సలార్ మూవీ నైజాంలో 70 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్ల మొత్తం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నైజాం ఏరియాలో సలార్ మూవీ భారీ టార్గెట్ ను సెట్ చేసిన నేపథ్యంలో పుష్ప ది రూల్ మూవీ ఆ కలెక్షన్లను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పుష్ప ది రైజ్ అంచనాలకు మించి సక్సెస్ సాధించిన నేపథ్యంలో పుష్ప ది రూల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు సుకుమార్ ఇచ్చిన అప్ డేట్స్ సైతం ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి. మైత్రీ నిర్మాతలకు పుష్ప ది రూల్ మూవీ భారీ లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది.

సలార్ ను నైజాంలో మైత్రీ నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ చేసిన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూషన్ ద్వారా కూడా మైత్రీ నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయి. మైత్రీ నిర్మాతలు సొంత బ్యానర్ లో భారీ సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ మూవీ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. (Pushpa2) పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. పుష్ప ది రూల్ మూవీ కోసం బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయనుందో చూడాల్సి ఉంది. ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus