Pawan Kalyan: పవన్ – గోగుల.. అప్పుడు మిస్ అయ్యారు.. ఈసారి మిస్ అవ్వకూడదు!
- September 4, 2026 / 05:29 PM ISTByFilmy Focus Desk
అంతర్జాతీయంగా హిట్ కొట్టిన ట్యూన్లను తీసుకొచ్చి తెలుగు సినిమా పాటలకు ట్యూన్లు చేశారు అనే చర్చ ఉన్నా.. తెలుగు సినిమాకు కొత్త రకం / కొత్త తరం సంగీతం అందించిన సంగీత దర్శకులు అంటూ ఓ లిస్ట్ రాస్తే.. అందులో టాప్‌లో ఉండే పేరు రమణ గోగుల. ప్రస్తుత తరం, నిన్నటి తరం, తొలి తరం సంగీత దర్శకులంత పెద్ద పేరు తెచ్చుకోకపోయినా.. ఆయనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారాయన. ఆ మధ్య ఓ సినిమాలో పాట పాడి తిరిగి టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చారు అనిపించినా.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
Pawan Kalyan
‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ గతేడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలో ‘గోదారి గట్టుపైన రామచిలకవే..’ అంటూ వింటేజ్ పెక్యూలియర్ వాయిస్‌తో అలరించిన రమణ గోగుల.. ఆ వెంటనే ‘ఓజీ’ సినిమాలో ఆయనో పాట పాడతారు అని వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు. అయితే అప్పుడు మిస్ అయిన ఆ కొలాబరేషన్ ఇప్పుడు సెట్ అయింది అనిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా రమణ గోగుల ఎక్స్‌లో చేసిన పోస్ట్.. అందులో రాసిన ఓ లైనే దీనికి కారణం.

ఆ పోస్టులో జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వచ్చిన రమణ గోగుల.. మీతో కలసి పని చేస్తూ మీ క్రియేటివిటీతో కొలాబరేట్ అయితే బాగుంటుంది అనిపిస్తోంది. ఇది ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది అని రమణ గోగుల రాసుకొచ్చారు. దీంతో ఇద్దరూ కలసి నెక్స్ట్ సినిమాకే కలసి పని చేస్తారేమో అనే అంచనాలు మొదలయ్యాయి. ‘ఓజీ 2’ సినిమానే నెక్స్ట్ పవన్ కల్యాణ్ చేయబోయేది. కాబట్టి ‘ఓజీ’ సినిమా సమయంలో మిస్ అయిన పవన్ – రమణ గోగుల కాంబో ‘ఓజీ 2’కి సెట్ అయ్యేలా ఉంది.
రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!














