అనసూయ ప్లేస్ లో రమ్యకృష్ణ..? ఏంటి ఈ కన్ఫ్యూజన్…?

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి డిసైడ్ అయ్యాడు నితిన్.ఇందుకుగానూ ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను ఎప్పుడో కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. కానీ ఇన్నాళ్లు సరైనా డైరెక్టర్ కోసం ఎదురుచూసాడు. ఈ క్రమంలో ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘కృష్ణార్జున యుధ్ధం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ని దర్శకుడిగా ఫైనల్ చేసాడు నితిన్. తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక మార్పుల్ని కూడా చేసినట్టు తెలుస్తుంది.

అయితే బాలీవుడ్ లో ఓ ముఖ్యమైన పాత్రని టబు పోషించింది. చాలా బోల్డ్ గా ఆ పాత్ర ఉంటుంది. మరి తెలుగులో ఆ పాత్రని ఎవరు చేస్తారా అని అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో అనసూయ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ ను సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తుంది.అంటే ఈ రీమేక్ లో నటించడానికి అనసూయ నిరాకరించిందా అనే డిస్కషన్లు మొదలయ్యాయి.

నిజానికి అలాంటి పాత్ర ‘క్షణం’ సినిమాలో అనసూయ చేసింది. అలాంటి పాత్ర మళ్ళీ చెయ్యాలా అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసిందా… లేక అదనంగా కొంచెం గ్లామర్ షో కూడా చెయ్యాల్సి వస్తుంది అని రిజెక్ట్ చేసిందా కొందరు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ మాత్రం ఇలాంటి పాత్రకి ఒప్పుకుంటుందా అనేది మరో ప్రశ్న. దీని పై చిత్ర యూనిట్ సభ్యులే క్లారిటీ ఇవ్వాలి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus