Sangeeth Shobhan: ప్రభాస్, మహేష్.. ఈ హీరోని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు?

అప్ కమింగ్ హీరోలకి.. ఇప్పుడున్న స్టార్ హీరోల సపోర్ట్ కనుక ఉంటే.. వారి కెరీర్ కు మంచి మైలేజ్ చేకూరుతుంది అని అంతా భావిస్తుంటారు. కొంతవరకు అది నిజమే. ఈ విషయంలో సంతోష్ శోభన్ ను చెప్పుకోవచ్చు. దివంగత స్టార్ రైటర్, దర్శకుడు అయిన శోభన్ పెద్ద కొడుకు సంతోష్ శోభన్ కి.. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్, మహేష్ ల నుండి మంచి సపోర్ట్ లభించింది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా ‘తను నేను’ ని ప్రభాస్, మహేష్ లు ప్రమోట్ చేసి హెల్ప్ చేశారు.

ఆ తర్వాత వచ్చిన ‘పేపర్ బాయ్’ విషయంలో కూడా మహేష్, ప్రభాస్ లు ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఇద్దరి హీరోలతో శోభన్ సినిమాలు చేశారు. శోభన్ దర్శకుడిగా మారింది మహేష్ బాబు ‘బాబీ’ సినిమాతో..! ఆ తర్వాత ‘వర్షం’ సినిమాని కూడా మహేష్ తో చేద్దామని అనుకున్నాడు శోభన్. కానీ అది ప్రభాస్ చేయడం. ప్రభాస్ కెరీర్ కి ఆ సినిమా బాగా హెల్ప్ అవ్వడం జరిగింది.

అందుకే సంతోష్ శోభన్… విషయంలో మహేష్, ప్రభాస్ లు ఆ స్టెప్ తీసుకుని ఉండొచ్చు. సంతోష్ శోభన్ నటించే ప్రతి సినిమాని ఇప్పటికీ ప్రభాస్ ప్రమోట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ విషయంలో మాత్రం.. ఈ ఇద్దరు స్టార్లు పెద్ద కేర్ చేయడం లేదు.

‘మ్యాడ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు (Sangeeth Shobhan) సంగీత్ శోభన్. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నాగవంశీ సమర్పణలో అతని సోదరి హారిక ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తన సినిమాకి ‘సితార ఎంటర్టైన్మెంట్స్ సపోర్ట్ సరిపోతుంది’ అని సంగీత్ శోభన్ .. ప్రమోషన్స్ లో చెబుతున్నాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus