Balakrishna, Tamanna: వచ్చే నెలలో అనిల్‌ రావిపూడి సినిమా అట!

  • December 6, 2021 / 06:28 AM IST

బాలకృష్ణ – తమన్నా… ఈ కాంబినేషన్‌ ఎలా ఉంటుంది? ఊరుకోండి… కుదిరే మాట అయితే చెప్పండి అని అంటారా! కుదిరేలా ఉంది కాబట్టే అంటున్నాం. బాలకృష్ణ – అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలుకానున్న విషయం తెలిసిందే. అన్నీ కుదిరితే సంక్రాంతి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. మొన్నీ మధ్య ‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలయ్య ఈ శుభవార్త చెప్పాడు కూడా. వచ్చే నెల మన సినిమా స్టార్ట్‌ కదా అని.

ఇప్పుడు సినిమా ముహూర్తం డేట్‌ చూచాయగా తెలిసిపోయింది కాబట్టి… ఇప్పుడు హీరోయిన్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. అనిల్‌ రావిపూడి సినిమాల్లో ఇటీవల కాలంలో రిపీట్‌ హీరోయిన్లు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో తమన్నా ఒకరు. ‘ఎఫ్ 2’ తర్వాత అనిల్‌ చేసిన రెండు సినిమాల్లో ఆమె ఉంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఆమెనే తీసుకుంటారనే టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు తమన్నా కూడా ఈ మధ్య సీనియర్‌ స్టార్ల సినిమాలు ఓకే చేస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి సరసన ‘భోళా శంకర్‌’లో నటిచడానికి తమన్నా ఓకే చేసింది. అదే ఫ్లోలో బాలయ్యతో కూడా నటించడానికి తమన్నా సై అంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారని టాక్‌. రెండో నాయికగా ప్రగ్యా జైశ్వాల్‌ను తీసుకుంటారని అంటున్నారు. త్వరలో ఈ విషయాలపై స్పష్టత వస్తుంది. ఈలోపు కాంబినేషన్‌ చర్చలు సాగనీయండి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus