Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Advertisement

నందమూరి అభిమానులు మే నెల అంటే ఒక పండుగ సీజన్ లా ఫీలవుతారు. ఎందుకంటే.. ఆ నెలలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు ఉంటుంది. ఈసారి కూడా మే దగ్గర పడుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది. ముఖ్యంగా తారక్ లైనప్‌లో ఉన్న భారీ చిత్రాల అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది బర్త్ డే అప్‌డేట్స్ చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయి.

Jr NTR

ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి ఫోకస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) పైనే ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చేసిన మేకోవర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లోపు పూర్తి కానుంది. బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.

‘దేవర’ పార్ట్-1 ‘ బాక్సాఫీస్ వద్ద బాగానే నిలబడింది. కానీ సీక్వెల్ విషయంలో క్లారిటీ లేదు. తారక్ కన్ఫర్మ్ చేసినా.. దర్శకుడు కొరటాల శివ వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నాడు. మే 20న దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబోలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే మైథాలజీ మూవీ అనౌన్స్ ఉంటుందని టాక్ నడిచింది. కానీ మధ్యలో ఈ ప్రాజెక్ట్‌లోకి అల్లు అర్జున్ వచ్చారనే వార్తలు కూడా షికారు చేశాయి. ఎన్టీఆర్ బర్త్ డే కి ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. దీంతో పాటు నెల్సన్ ప్రాజెక్టు గురించి కూడా అనౌన్స్మెంట్ రావొచ్చు.

‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus