Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘ప్రభాస్‌ రాజాసాబ్‌’ మినహాయితే మిగిలిన అన్ని సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. రవితేజ సినిమా ఓకే అనిపించినా ఆయన రీసెంట్‌ ఫామ్‌కి అది విజయమే అని చెప్పాలి. ఆ విషయం పక్కన పెడితే ఈ సంక్రాంతి మొత్తం యంగ్‌ హీరోల కెరీర్‌ స్టేటస్‌ ఏంటి అనే చర్చకు కారణమైంది. కారణం చాలా ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కి మంచి హిట్‌ పడటమే. దీంతో మన దగ్గర విజయానికి దూరంగా ఉన్న యువ హీరోలు కూడా హిట్‌ ట్రాక్‌ ఎక్కాలి అనే డిస్కషన్‌ మొదలైంది. ఎవరా అని చూస్తే..

Tollywood Heros

* ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ ఈ సంక్రాంతికి వచ్చాడు శర్వానంద్‌. రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా శర్వాకు కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్‌ అని చెప్పొచ్చు. ఈ ఊపులోనే ‘బైకర్‌’ సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు.

* ల‌వ్ స్టోరీలతో మంచి విజయాలు అందుకున్న నాగ శౌర్య మాస్‌, యాక్షన్‌ సినిమాలవైపు వచ్చాడు. అలా ఇప్పుడు ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తిక్‌’, ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమాలు చేశాడు. ఇవి కెరీర్‌ సంగతి తేల్చే సినిమాలే.

* మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ పరిస్థితి భిన్నం. మంచి కథలే ఎంచుకుంటున్నా విజయాలు రావడం లేదు. అలాంటిది ఫ్లాప్‌ ఫామ్‌లో ఉన్న మేర్లపాక గాంధీతో ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’ చేస్తున్నాడు. ఇద్దరూ జోనర్‌ మార్చిన నేపథ్యంలో ఏమవుతుందో చూడాలి.

* పెద్ద విజయాలు చూసి.. ఇప్పుడు పెద్ద పరాజయాలతో పరేషాన్‌లో ఉన్నాడు విజయ్‌ దేవరకొండ. ‘కింగ్ డ‌మ్’ సినిమాతో హిట్‌ కొట్టినం అనుకున్నారు. కానీ కలసి రాలేదు. ఇప్పుడు ‘రౌడీ జ‌నార్థ‌న‌’, ‘ర‌ణ‌బాలి’తో సెప్టెంబరు, డిసెంబరులో రానున్నాడు.

* వరుస ఫ్లాప్‌లు ఉండి.. ఇప్పుడు హిట్‌కి దగ్గరలో ఉన్నాడు అనే వైబ్‌ ఉన్న హీరో విశ్వక్‌సేన్‌. అనుదీప్‌ ‘ఫంకీ’తో నవ్విస్తూ విజయం సాధించాలని చూస్తున్నాడు. ఈ ప్రేమ సినిమా కథ ఎలా ఉంటుందో చూడాలి.

* ‘డ‌బుల్ ఇస్మార్ట్’, ‘స్కంద’, ‘ఆంద్రా కింగ్ తాలుకా’ అంటూ వరుసగా పరాజయాలు అందుకున్న రామ్‌.. ఇప్పుడు ఆర్కా మీడియా బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఫలితం చాలా కీలకం.

సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus