Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 6, 2026 / 08:36 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అభిషణ్ జీవింత్ (Hero)
  • అనశ్వర రాజన్ (Heroine)
  • శరవణన్, తేని మురుగన్, సచిన్ తదితరులు (Cast)
  • మదన్ (Director)
  • మగేష్ పసిలియన్ - సౌందర్య రజనీకాంత్ (Producer)
  • సియాన్ రోల్డన్ (Music)
  • శ్రేయాస్ కృష్ణ (Cinematography)
  • సురేష్ కుమార్ (Editor)
  • Release Date : ఫిబ్రవరి 06, 2026
  • జియాన్ ఫిలిమ్స్ - ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ (Banner)

దర్శకుడిగా తొలి చిత్రం “టూరిస్ట్ ఫ్యామిలీ”తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతోపాటు, అమితమైన గౌరవాన్ని సైతం దక్కించుకున్న అభిషణ్.. హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “విత్ లవ్”. మదన్ దర్శకత్వం వహించగా.. సౌందర్య రజనీకాంత్ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో అనువదించారు. మరి ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది అనేది చూద్దాం..!!

With Love Movie Review

With Love Movie Review and Rating

కథ: సత్య (అభిషణ్ జీవింత్), మోనిషా (అనశ్వర).. పెద్దలు ఏర్పాటు చేసిన నవతరం పెళ్లిచూపుల్లో భాగంగా ఓ కాఫీ షాప్ లో కలుస్తారు. అనంతరం వాళ్లిద్దరూ ఒకే స్కూల్లో సీనియర్, జూనియర్ అని తెలుసుకొని.. వారి వారి లవ్ స్టోరీస్ షేర్ చేసుకుంటారు. అయితే.. ఇద్దరూ తమ ప్రేమను, తాము ప్రేమించినవారికి వ్యక్తపరచలేకపోయామని గ్రహించి.. వాళ్లకి ఇప్పుడైనా ప్రపోజ్ చేసి.. వాళ్ల జీవితాల్లో వెలితిని తీర్చేసుకోవాలనుకుంటారు.

అలా మొదలైన వాళ్ల జర్నీ, చిత్రమైన మలుపులు తిరుగుతుంది. చివరికి వాళ్ల ప్రయాణం ఏ తీరానికి చేరింది? అనేది “విత్ లవ్” కథాంశం.

With Love Movie Review and Rating

నటీనటుల పనితీరు: అనశ్వర రాజన్ మొన్నటివరకు కాస్త సైలెంట్ రోల్స్ ప్లే చేసి.. ఈ సినిమాలో కాస్త డామినేట్ చేసే పాత్రలో కనిపించేసరికి కొత్తగా కనిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్, క్యారెక్టరైజేషన్ బాగున్నాయి. ఆమె వయసుకి తగ్గ పాత్ర కావడంతో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా స్కూల్ పోర్షన్స్ లో అనస్వర భలే చూడముచ్చటగా ఉంది.

అభిషణ్ కూడా కొత్త నటుడు అని ఎక్కడా అనిపించదు. ఒక సగటు కుర్రాడిగా చక్కగా జీవించేశాడు. ముఖ్యంగా కామెడీ బాగా వర్కవుట్ చేశాడు. క్లైమాక్స్ లో తాగేసి ఫ్రెండ్స్ కి ఫోన్లు చేసే సీన్ భీభత్సంగా పేలింది.

మిగతా నటీనటులందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.

With Love Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం తీసుకున్న జాగ్రత్తల గురించి చెప్పుకోవాలి. దాదాపుగా ఎక్కడా తమిళ అక్షరాలు కనబడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే.. తెలుగు వెర్షన్ కోసం దేవిశ్రీప్రసాద్ ఫోటో వాడడం బాగుంది. త్రిచ్చిని తుని అంటూ కవర్ చేయడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ.. అథెంటిసిటీ మిస్ అయ్యింది. కాకపోతే.. కామెడీ కారణంగా దాన్ని అంతగా ఎవరూ కేర్ చేయరు. డబ్బింగ్ డైలాగ్ వెర్షన్ కూడా బాగా రాసుకున్నారు. తెలుగు మీమ్స్ ని ఇంక్లూడ్ చేసిన విధానం అలరిస్తుంది.

దర్శకుడు మదన్, మనం ఆల్రెడీ “నా ఆటోగ్రాఫ్, 96” లాంటి సినిమాల్లో చూసేసిన ఎమోషన్ నే సరికొత్తగా చూపించాడు. ముఖ్యంగా.. హీరోహీరోయిన్లు యంగ్ గా ఉండడం, స్కూల్ పోర్షన్స్ కి కూడా వాళ్లు యాప్ట్ గా సరిపోవడం మంచి నాస్టాల్జియా ఫీల్ ఇచ్చింది. ఇక కథనం కంటే.. సందర్భాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్లస్ అయ్యింది. ఆల్మోస్ట్ ప్రతి సందర్భం, సన్నివేశం రిలేటబుల్ గా ఉంది. పాత్రల్లో మనల్ని మనం చూసుకుంటాం. హాస్యం మాత్రమే కాక.. దానికి తగ్గ ఎమోషన్ ను కూడా పండించిన విధానం హర్షణీయం. అంతర్లీనంగా జీవితాన్ని మనం చూసే కోణం ఎలా ఉండాలి అనేది కూడా హృద్యంగా చెప్పిన విధానం అలరిస్తుంది. ఫస్ట్ బాల్ తోనే సిక్స్ కొట్టాడు దర్శకుడు మదన్.

సియాన్ రోల్డన్ పాటలు బాగున్నాయి. సాహిత్యం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. తెలుగు వెర్షన్ కోసం తమిళ ట్యూన్స్ లో తెలుగు పదాలు ఇరికించినట్లుగా ఉంది కానీ.. సరైన భావం వినిపించలేదు.

ఆర్ట్ & ప్రొడక్షన్ టీమ్ పనితనం సినిమాకి మేజర్ హైలైట్. సినిమాలో కనిపించేవి తిప్పి కొడితే ఓ 5 లొకేషన్లు. వాటిని రకరకాల యాంగిల్స్ లో రిపిటీటివ్ ఫీల్ కలగకుండా చిత్రించిన విధానం బాగుంది. అందుకు సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ కృష్ణ కూడా అభినందనీయుడు. లొకేషన్స్ కంటే.. కంటెంట్ క్వాలిటీని ఎలా బెటర్ చేయొచ్చు అనే విషయంలో బడ్జెట్ ను వాడుకున్నారు.

With Love Movie Review and Rating

విశ్లేషణ: తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అనే డెసిషన్ ఆఖరి నిమిషంలో తీసుకోవడంతో.. “విత్ లవ్” సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైందన్న విషయం చాలామందికి తెలియదు. టైటిల్ కూడా ఒకరకంగా మైనస్. అయితే.. టీమ్ కాస్త ఓపిగ్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తే మరో “ప్రేమలు” రేంజ్ హిట్ అందుకొనే లక్షణాలు పుష్కలంగా ఉన్న సినిమా ఇది. మంచి హెల్తీ ఫన్, హిలేరియస్ ఎపిసోడ్స్ & ఎంగేజింగ్ ఎమోషన్స్ ఉన్న “విత్ లవ్” మస్ట్ వాచ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

With Love Movie Review and Rating

ఫోకస్ పాయింట్: మంచి ఫీల్ గుడ్ సినిమా!

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abishan Jeevinth
  • #Anaswara Rajan
  • #Madhan
  • #With Love Movie

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

39 mins ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 hour ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

8 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 day ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version